Sindhu's win, a perfect 'birthday' gift for PM Modi కొరియా ఓపెన్ ను ప్రధానికి అంకితమిచ్చిన సిందూ

Pv sindhu dedicates her victory to beloved pm modi on his birthday

korea open badminton 2017, PV Sindhu, PM Modi, Prime Minister Narendra modi, Nozomi Okuhara, Korea Open final,Korea Open 2017, Korea Open, Son Wan, Sung Ji Hyun, Minatsu Mitani, sindhu badminton, korea super series 2017, india badminton, Badminton, sports news, latest badminton news, latest sports news

Star India shuttler PV Sindhu has dedicated her Korea Open Super Series title win to the Prime Minister Narendra Modi for his “selfless service” to the nation.

కొరియా ఓపెన్ ను ప్రధానికి అంకితమిచ్చిన సిందూ

Posted: 09/18/2017 06:18 PM IST
Pv sindhu dedicates her victory to beloved pm modi on his birthday

కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంటులో భారత అగ్రశ్రేణి షట్లర్, ఒలింపిక్‌ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు టైటిల్ సాధించి తన ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయాన్ని ఏకంగా దేశ ప్రధాని నరేంద్రమోడీకి అంకితమిచ్చింది. 22 ఏళ్ల ఈ హైదరాబాదీ.. క్రితం రోజున ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ జపాన్ కు చెందిన ఒకుహరను మట్టికరిపించి కొరియా ఓపెన్‌ సిరీస్‌ టైటిల్‌ దక్కించుకుని తన ప్రపంచ ఛాంపియన్ షిఫ్ పోటీ ఫైనల్ పోరు.. ప్రతికారాన్ని కూడా తర్చుకున్న విషయం తెలిసిందే. ఈ టైటిల్‌ చేజిక్కించుకున్న తొలి భారత షట్లర్ గా రికార్డు సృష్టించింది.

ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ ద్వారా సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ గెలిచిన సింధుకు అభినందనలు. ఆమె విజయం దేశానికి గర్వకారణం’ అని మోదీ పేర్కొన్నారు. మోదీ ట్వీట్‌కు స్పందించిన పీవీ సింధు.. ఈ విజయం ప్రధాని జన్మదినం రోజున సాధించడంతో.. దానిని నరేంద్రమోడీకే అంకితమిస్తున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఏ మాత్రం అలసట లేకుండా దేశానికి ఆయన అందిస్తోన్న సేవలు చిరస్మరణీయమని సింధు పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Badminton  Korea Open Super Series  Minatsu Mitani  PV Sindhu  PM Modi  Sameer Verma  

Other Articles