PV Sindhu enters Korea Open final అరుణ సింధూరం.. ప్రతీకారం.. అడుగు దూరం..

Pv sindhu enters korea open final faces okuhara

PV Sindhu, Korea Open Super Series, Korea Open, Nozomi Okuhara, He Bingjiao, indian badminton news, badminton news, badminton news, latest badminton news, sports, badminton

Olympic silver-medallist PV Sindhu defeated China's He Bingjiao in the semi-finals to set up a mouth-watering summit clash with world champion Nozomi Okuhara of Japan at the Korea Open Super Series.

అరుణ సింధూరం.. ప్రతీకారం.. అడుగు దూరం..

Posted: 09/16/2017 03:59 PM IST
Pv sindhu enters korea open final faces okuhara

అరుణ సింధూరం ఎరుపెక్కింది. ఐదో సీడ్ గా బిరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ దిగ్గజం.. తెలుగు తేజం.. పివీ సింధూ.. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ లో ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. కొరియా టైటిల్ ను కూడా భారత మాత సిగలో అలంకరించేందుకు మరో అడుగుదూరంలో నిలిచింది. అయితే ఇక్కడ తనకు ప్రతికారం కూడా తీర్చుకునే అవకాశం లభించింది.

ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంఫియన్ షిప్ ఫైనల్లో తాను గురిపెట్టిన స్థానాన్ని ఒక్కసాయింట్ తేడాతో అందుకున్న జపాన్‌ క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్ క్రీడాకారిణి నొజోమి ఒకుహరాతో తలపడనుంది. ఇంత త్వరగా ఒకుహరాతో తలపడే అవకాశం వస్తుందని భావించని సింధూకు కొరియా ఓపెన్ అవకాశాన్ని కల్పించింది. దీంతో ప్రతికారం తీర్చుకునే క్రమంలో సింధూ.. అరుణ సింధూరంగా మారుతుంది. ఒకుహరాతో రేపు జరగనున్న ఫైనల్స్ లో టైటిల్ ను సాధించి తన ప్రతీకారానికి బదులు తీర్చుకోవాలని సన్నధమవుతుంది.

ఇవాళ సెమీస్ లో ఆరోసీడ్‌, చైనా క్రీడాకారిణి హి బింగ్ జియావోతో తలపడిన సింధూ.. హోరాహోరీ పోరులో అమెపై 21-10, 17-21, 21-16తో విజయం సాధించి ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన సింధు తొలి గేమ్‌ని 21-10తో సొంతం చేసుకుంది. ఐతే రెండో గేమ్‌.. భిన్నంగా సాగింది. ప్రత్యర్థి నుంచి సింధుకి వూహించని ప్రతిఘటన ఎదురుకావడంతో 16 పాయింట్ల వద్ద నుంచి ఎదురీదాల్సి వచ్చింది.

దీంతో 17-21 తో రెండో గేమ్ ను చేజార్చుకుంది. దీంతో నిర్ణయాత్మక మూడో గేమ్ లో సింధు ప్రత్యర్థిపై విరుచుకుపడింది. నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ సింధూ 21-16 తేడాతో గేలుపోంది ఫైనల్లో అడుగుపెట్టింది. రేపు జరగనున్న ఫైనల్ లో మరోమారు సింధు-ఒకుహర తలపడనుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  Korea Open  Nozomi Okuhara  He Bingjiao  badminton  

Other Articles