కేంద్ర క్రీడాశాఖపై ప్రముఖ గోల్ఫర్ గుస్సా Chawrasia left high and dry by IOA, ministry

Ioa ministry treated us like servants at rio golfer chawrasia

indian olympic association, ioa, rio olympics, sports ministry, ssp chawrasia, rio olympics, indian golfer, chawrasia, ministy of sports, hospitality, lahiri, servants, indian olympic association

Top Indian golfer SSP Chawrasia has lashed out at the Indian Olympic Association and Sports ministry for not yet receiving the full amount of promised Rs 30 lakh earmarked as preparatory money for the Rio Olympics.

కేంద్ర క్రీడాశాఖపై ప్రముఖ గోల్ఫర్ గుస్సా

Posted: 12/23/2016 06:01 PM IST
Ioa ministry treated us like servants at rio golfer chawrasia

రియో ఒలింపిక్స్ ముగిసి సుమారుగా ఐదు నెలలు కావస్తున్నా దాని చుట్టూ అలముకున్న వివాదాలు మాత్రం ఇంకా సజీవంగానే వున్నాయి. నాలుగు మాసాల క్రితం తమకు రియో ఒలింపిక్స్‌కు సంబంధించి ఇస్తామన్న రూ. 30 లక్షల నగదును ఇప్పటి వరకు ఇవ్వలేదని భారత అగ్రశ్రేణి గోల్ఫర్ ఎస్ఎస్‌పి చౌరాసియా మండిపడ్డాడు. భారత ఒలింపిక్ సంఘం మీద, క్రీడా మంత్రిత్వశాఖ అధికారుల చేస్తున్న తాత్సారంపై అగ్రహాన్ని వ్యక్తం చేశారు. క్రీడాకారులతో అవసరం తీరిందని ఆయా శాఖలు బావిస్తున్నట్లున్నాయని దుయ్యబట్టారు.

భారత ఒలంపిక్స్ సంఘం, కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖలు ఇలాగే వ్యవహరిస్తే ఈ సారి ఒలింపిక్స్‌లో తాను భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం కూడా అనుమానమే తేల్చిచెప్పాడు. అతడితో పాటు పాల్గొన్న మరో గోల్ఫర్ అనిర్బన్ లాహిరికి కూడా క్రీడా శాఖ నుంచి రావాల్సిన మొత్తం ఇంకా రాలేదు. రియో ఒలింపిక్స సమయంలో భారత ఒలింపిక్ సంఘం అధికారులు తమను సర్వెంట్లలా చూశారని చౌరాసియా ఆగ్రహంవ్యక్తం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 16 టైటిళ్లు గెలుచుకున్న లాహిరికి కూడా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, తనకు మాత్రం ఎలాగోలా ఇప్పటికి రూ. 5.5 లక్షలు ఇచ్చారని చౌరాసియా చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles