భారత హాకీ జూనియర్ జట్టుపై ప్రశంసలు వెల్లువ India win Junior Hockey World Cup, set Twitter abuzz

Junior hockey world cup india claim title with 2 1 win over belgium

india junior hockey world cup, junior hockey world cup, india vs belgium, belgium vs india, hockey news, hockey india, hockey

India junior team beat Belgium 2-1 in the final to lift the Junior World Cup title for the second time in their history.

భారత హాకీ జూనియర్ జట్టుపై ప్రశంసలు వెల్లువ

Posted: 12/19/2016 01:45 PM IST
Junior hockey world cup india claim title with 2 1 win over belgium

జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ లో భారత ఆటగాళ్లు మరోసారి చరిత్ర సృష్టించడంతో సోషల్ మీడియాలో వారిపై ప్రశంసలు వెల్లువెత్తతున్నాయి. కేంద్రమంత్రులు, రాజకీయ నాయకులు, క్రీకెట్ ఆటగాళ్లు మొదలుకుని అన్ని వర్గాల నుంచి హాకీ జూనియర్స్ జట్టు ప్రతిభను అభినందిస్తూ.. ప్రశంసలు వస్తున్నాయి. ఇక మరోవైపు జట్టు కోచ్ హరిందర్ పై కూడా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. జూనియర్స్ జట్టును విజయం దిశగా నడిపిన ఆయనకు కూడా ట్విట్టర్ వేదికగా ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపారు.

15 ఏళ్ల క్రితం చివరిసారి జూనియర్ వరల్డ్ కప్ హాకీ టైటిల్ ను సాధించిన భారత్.. మరోమారు ఆ చరిత్రను పునారావృతం చేసింది. ఉత్తర్ ప్రదేశ్ లోని లోక్నో వేదికగా మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి బెల్జియంపై 2-1 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించి ప్రపంచ విజేతగా నిలిచింది. తమపై పెట్టుకున్న నమ్మకాన్ని హర్జిత్ సింగ్ అండ్ గ్యాంగ్ నిలబెట్టుకుంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఓటమి అనేది లేకుండా ఫైనల్ పోరుకు అర్హత సాధించినా.. చివరి మెట్టుపై బెల్జియంను భారత్ బోల్తా కొట్టించింది.

ఆట మొదలైన 8వ నిమిషంలో గుర్జంత్ సింగ్ బెల్జియం గోల్ కీపర్ ను బోల్తా కొట్టిస్తూ భారత్ కు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ మరుసటి నిమిషంలో నీలకంఠశర్మ గోల్ పోస్ట్ కు బంతిని కొట్టగా తృటిలో గోల్ చేజారింది. 22వ నిమిషంలో సిమ్రన్ జీత్ సింగ్, నీలకంఠ సమిష్టిగా గోల్ చేసి ఆధిక్యాన్ని రెట్టింపు చేశారు. ఆటముగిసే సరికి బెల్జియం కేవలం ఒక్క గోల్ చేయడంతో 2-1తో భారత్ రెండో పర్యాయం జూనియర్ హాకీ ప్రపంచ కప్ ను ముద్దాడింది. తద్వారా జర్మనీ తర్వాత రెండుసార్లు ఈ ప్రపంచ కప్ నెగ్గిన జట్టుగా భారత్ ఘనత వహించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior Hockey WorldCup 2016  Hockey India  Belgium  Twitter  

Other Articles

Today on Telugu Wishesh