WWE పోటీలకు ఒలంపిక్ పతక విజేత సుశీల్ కుమార్ Sushil Kumar Likely to Make WWE Debut in 2017

Olympic medalist sushil kumar set to make wwe debut in 2017

Sushil Kumar, Olympic medalist, Wrestler, Indian wrestler, WWE, WWE debut, Rio Olympics, the great Khali, Narsingh scandal, New Delhi, Sports News, WWE Indian Wrestler, After Khali now Sushil Kumar

Two-time Indian Olympic medallist Sushil Kumar is reportedly all set to make his World Wrestling Entertainment (WWE) debut in 2017.

WWE పోటీలకు ఒలంపిక్ పతక విజేత సుశీల్ కుమార్

Posted: 12/30/2016 06:18 PM IST
Olympic medalist sushil kumar set to make wwe debut in 2017

రియో ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశాన్ని మిస్ అయిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్.. కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తున్నాడు. రెండు పర్యాయాలు భారత్ కు పతకాలను సాధించిన పెట్టిన ఈ రెజ్లర్ రియోలో పాల్గొనేందుకు భారత రెజ్లింగ్ అడ్డుకున్న నేపథ్యంలో.. ఇక తన కెరీర్ ను మరో మార్గంలో మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తున్నాడు.

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్యూడబ్యూఈ)తో ఒప్పందం చేసుకునేందుకు సమాయత్తమవుతున్నాడు ఈ హర్యానా రెజ్లర్.  ఈ మేరకు గత అక్టోబర్లో డబ్యూడబ్యూఈతో పూర్తిస్థాయి చర్చలు జరిపిన సుశీల్ కుమార్.. అందుకు తాజాగా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో డబ్యూడబ్యూఈ ఈవెంట్లలో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తికనబరచని సుశీల్.. తనకు అదే సరైనదని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దీనిలో భాగంగానే డబ్యూడబ్యూతో  మరొకసారి సంప్రదింపులు జరిపి తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది నవంబర్ లో డబ్యడబ్యూఈ ఈవెంట్లలో సుశీల్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ది గ్రేట్ ఖలీ తరువాత వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లలో పాల్గొన్న రెండో భారత రెజ్లర్గా సుశీల్ నిలుస్తాడు. గతంలో రెండుసార్లు ఒలింపిక్స్ పతకాలు సాధించిన సుశీల్ కుమార్.. రియోకు వెళ్లేందుకు తనకే అర్హత ఉందంటూ భారత రెజ్లింగ్ సమాఖ్యతో పోరాడి ఓడిపోయాడు.

సాంకేతికంగా నర్సింగ్ యాదవ్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడంతో సుశీల్ దూరంగా ఉండాల్సి వచ్చింది. దీనిపై సుశీల్ కడవరకూ పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 30 నుంచి 40 వరకూ ఉన్న రెజ్లర్లను షార్ట్ లిస్ట్ చేసే పనిలో పడ్డ డబ్యూడబ్యూఈ.. భారత రెజ్లర్లపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. దీనిలో్ భాగంగా సుశీల్ కుమార్ పేరు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushil Kumar  WWW  wrestling  WWE debut  Rio Olympics  sports  

Other Articles