మకావు ఓపెన్: క్వార్టర్స్ లోకి సైనా.. కశ్యప్ కు నిరాశ Saina wins, Kashyap lose in Macau Open

Saina nehwal enters third round kashyap bows of macau open

Saina Nehwal, Macau Open, P Kashyap, Indonesia, Dinar Dyah Ayustine, Hanna Ramadini

Apart from Saina Nehwal, Parupalli Kashyap and men's doubles pair of Manu Attri and B Sumeeth Reddy lost their respective singles and doubles matches.

మకావు ఓపెన్: క్వార్టర్స్ లోకి సైనా.. కశ్యప్ కు నిరాశ

Posted: 12/01/2016 06:45 PM IST
Saina nehwal enters third round kashyap bows of macau open

హైదరాబాదీ స్టార్ షట్లర్ సైనా నెహ్వాలో్ మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో తన జోరు కొనసాగిస్తుంది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో సైనా తన ప్రత్యర్థిని చిత్తు చేసి ఏకంగా క్వార్టర్ ఫైన్సల్స్ లోకి అడుగుపెట్టింది. మోకాలి సర్జరీ తరువాత అమె రెండవ సారి టోర్నమెంటుల్లో క్వార్టర్స్ కు చేరింది. ఇవాళ జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో సైనా 17-21, 21-18, 21-12 తేడాతో దినార్ ద్యా అయుస్టెన్ (ఇండోనేషియా)పై గెలిచి క్వార్టర్స్ లోకి దూసుకెళ్లింది. తొలి గేమ్ను కోల్పోయిన సైనా.. ఆ తరువాత తిరిగి పుంజుకుంది. వరుస రెండు సెట్లలో గెలిచి టోర్నీలో నిలబడింది.

ఇక మరోవైపు పురుషుల సింగిల్స్ లో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ నిష్ర్కమించాడు. ఇవాళ జరిగిన రెండో రౌండ్ పోరులో కశ్యప్ 13-21, 20-22 తేడాతో లిన్ యు సెన్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్ను ఎటువంటి ప్రతిఘటన లేకుండా కోల్పోయిన కశ్యప్ రెండో గేమ్లో పోరాడి ఓడాడు. తన ప్రత్యర్థి లిన్ యు సెన్ ధాటికి కశ్యప్ లొంగిపోయాడు. తొలి సెట్ లో పూర్తిగా అధిపత్యం వహించిన ప్రత్యర్థికి మోకరిల్లిన కశ్యప్.. రెండో సెట్ లో నువ్వా-నేనా అన్నట్లుగా పోరాడి ఓటాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  Macau Open  P Kashyap  Indonesia  Dinar Dyah Ayustine  Hanna Ramadini  

Other Articles