మకావుకు సైనా ప్రాతినిథ్యం.. తప్పుకున్న సింధు Saina Nehwal to lead India in Macau Open

Macau open saina gets top billing after sindhu withdrawal

pv sindhu, sindhu, pv sindhu macau open, macau open, macau open 2016, saina nehwal, saina, sindhu saina, badminton india, badminton news, sports, sports news

Saina Nehwal will lead India’s charge in the Macau Open Grand Prix Gold badminton tournament, after three-time champion P V Sindhu pulled out of the event to prepare herself for the Dubai Super Series Finals.

మకావుకు సైనా ప్రాతినిథ్యం.. తప్పుకున్న సింధు

Posted: 11/29/2016 05:38 PM IST
Macau open saina gets top billing after sindhu withdrawal

స్టార్ షట్లర్ పివి సింధు ఈ ఏడాది జరగనున్న మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ టోర్నీ నుంచి తప్పుకుంది. దీంతో భారత్ తరుపున ఈ టోర్నమెంటులో మరో హైదరాబాదీ స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ పాల్గొంటుంది. గతేడాది మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను సాధించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఒకే టోర్నమెంట్‌ను వరుసగా మూడుసార్లు గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా నిలిచిన సింధూ.. చివర క్షణంలో టోర్నీ నుంచి తప్పుకుంది.

ఇటీవల చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను గెలిచి ఉత్సహాంతో వున్న సింధూకు హాంకాంగ్ ఓపెన్ ఫైనల్ లో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అమె రన్నర్ అప్ గానే నిలిచింది. ఈ నేపథ్యంలో వచ్చిన మకావు ఓపెన్ లో డిఫెండింగ్ చాంపియన్గా ఆడాల్సి వున్నా.. వచ్చే నెలలో జరగనున్న దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీకి సరికొత్త ప్రణాళికలతో సిద్ధమయ్యే  క్రమంలోనే సింధు మకావు నుంచి వైదొలిగింది.

ఈ విషయాన్ని సింధు తండ్రి పివి రమణ స్పష్టం చేశారు.' ముందస్తు ప్రణాళిక ప్రకారం మకావు గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు పాల్గొనాల్సి వుంది. కానీ దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ కు సింధు అర్హత సాధించిన తరువాత ప్రణాళికను మార్చుకున్నాం. మకావు నుంచి తప్పుకుని దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ కు సన్నద్ధం కావాలనే క్రమంలోనే సింధు తప్పుకుంది'అని వెంకట రమణ వివరణ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pv sindhu  siana nehwal  macau open  dubai super series  badminton  

Other Articles