ఆసియా చాంప్రియన్స్ ట్రోఫి: ఫైనల్స్ లోకి భారత్ India beat Korea to set up title clash against Pakistan

Asian champions trophy india beat korea to set up title clash against pakistan

ACT 2016, Asian Champions Trophy 2016, hockey, India, India vs South Korea, Indian hockey team, Live blog, Ramandeep Singh, Roelant Oltmans, Rupinder Pal Singh, SK Uthappa, South Korea

Goalkeeper PR Sreejesh starred in front of the goal to help India beat South Korea in the penalty shootout and set up a mouth-watering title clash against arch-rivals Pakistan in the fourth Asian Champions Trophy hockey tournament.

ఆసియా చాంప్రియన్స్ ట్రోఫి: ఫైనల్స్ లోకి భారత్

Posted: 10/29/2016 06:09 PM IST
Asian champions trophy india beat korea to set up title clash against pakistan

దేశ జాతీయ క్రీడలో కూడా భారత్ అద్భుతంగా రాణిస్తుంది. అంచనాలను తలకిందులు చేస్తూ.. సాగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీలో టీమిండియా ఏకంగా ఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో అప్రతిహాత విజయాలతో సాగుతున్న భారత జట్టు టైటిన్ ను సొంతం చేసుకునేందుకు మరో అడుగుదూరంలో నిలిచింది. ఇవాళ మలేసియాలోని క్వాంటన్  వేదికగా జరిగిన సెమీ ఫైనల్లో భారత్  పెనాల్టీ షూటౌట్లో 5-4 తేడాతో గెలిచి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. తొలి నాలుగు క్వార్టర్లు ముగిసే సరికి ఇరు జట్లు 2-2 తో సమంగా ఉండటంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.
 
ఇందులో భారత్ ఐదు గోల్స్ సాధించి ఫైనల్ కు చేరగా, కొరియా నాలుగు గోల్స్ కు మాత్రమే పరిమితమై టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2011లో తొలిసారి జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్.. మరోసారి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగింది. లీగ్ దశను దిగ్విజయంగా అధిగమించిన భారత్.. అదే జోరును సెమీస్లో కూడా కనబరించింది.  కీలక ఆటగాళ్లు దూరమైనా భారత అభిమానులు పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ ఫైనల్లోకి ప్రవేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teamindia  korea  asian hockey tournment  title  pakistan  

Other Articles