సహచర రెజ్లర్ తో రియో పతక విజేత నిశ్చితార్థం Sakshi Malik gets engaged to fellow wrestler in Rohtak

Olympic medallist sakshi malik engaged to wrestler satyawart kadian

Freestyle wrestling, Rohtak, Sakshi Malik, Sakshi Malik engagement, Sakshi Malik wedding, Satyawart Kadian, Wrestling, Rio Olympic medallist, sakshi mallik satyawart kadian, sakshi kadian engagement

Rio Olympic medallist Sakshi Malik got engaged to wrestler boyfriend Satyawart Kadian at her residence in Rohtak.

సహచర రెజ్లర్ తో రియో పతక విజేత నిశ్చితార్థం

Posted: 10/17/2016 11:19 AM IST
Olympic medallist sakshi malik engaged to wrestler satyawart kadian

ఏ రంగానికి చెందిన వారు ఆయా రంగానికి చెందిన వారితోనే పరిణయానికి ముందడుగు వేస్తారని పెద్దలు అంటుంటారు. ముఖ్యంగా మహిళల్లో మాత్రం ఇది అధికంగా జరుగుతుంటుంది. ఇలా పరిణయాలు చేసుకోవడానికి కారణం కూడా వారు అధ్యయనం చేశారు. అయా రంగానికి చెందిన సమస్యలు ఎలా వుంటాయో తెలియడానికే.. భవిష్యత్తులో తమవారితో తాము ఎలాంటి సమస్యలు తల్తెత్తకుండా సాఫీగా సంసార జీవితం సాగిపోవడానికి ఇలా చేస్తారని కూడా వివరణలు వినబడతున్నాయి. సరిగ్గా అలాగే రియో ఒలింపిక్స్‌ పతక విజేత రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ కూడా తన కావాల్సిన వాడిని తానే ఎంచుకుంది.

దీంతో పెద్దలు కాదనలేక అమెకు నచ్చిన వాడితోనే పరిణయం చేయడానికి సుముఖతను వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా హర్యాణాలోని రొహ్ తక్‌ నగరానికే చెందిన ప్రియుడు, రెజ్లర్‌ సత్యవర్త్‌ కడియన్‌ తో క్రితం రోజున నిశ్చితార్థం కూడా జరిగింది. ఒలింపిక్ పతకం గెలిచేంత వరకు గోప్యంగా వుంచిన అమె ఇక పతకం సాధించి అనందోత్సవ సమయంలో తన రహస్యాన్ని పెద్దలకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. ఇందులో భాగంగా తమ రెండు కుటుంబాలకు చెందిన సభ్యుల సమక్షంలో జరిగిన నిశ్చితార్థ వేడుక చాలా బాగా జరిగిందని సత్యవర్త్‌ తండ్రి సత్యవాన్‌ వెల్లడించారు.

సత్యవర్త్‌ కూడా పలు ప్రపంచస్థాయి పోటీలలో దేశానికి పతకాలు అందించారు. 97 కేజీల విభాగంలో పోటీపడే సత్యవర్త్ 2014లో గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం, ఇంచియాన్‌ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచి సత్తాచాటాడు. వాస్తవానికి రియో ఒలింపిక్స్‌ కు ముందే వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఒలింపిక్స్ సన్నాహాల్లో లోపం ఉండకూడదని వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో సాక్షి మాలిక్‌ రియోలో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, 24 ఏళ్ల సాక్షి మాలిక్‌ కన్నా సత్యవర్త్‌ రెండేళ్లు చిన్నవాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sakshi Malik  Satyawart Kadian  Rio Olympics  Sakshi Malik Marriage  2010 Youth Olympics  

Other Articles