ప్రపంచ నాల్గవ ర్యాంకును అందుకున్న సాక్షిమాలిక్.. Wrestler Sakshi Malik takes 4th spot in world rankings

Wrestler sakshi malik takes 4th spot in world rankings

sakshi malik, sakshi, malik, sakshi malik wrestling, sakshi malik wrestler, world wrestling ranking, wrestling news, wrestling, sports, news, world news, sports news, latest news, international sports news

Sakshi Malik entered the top-five in the latest United World Wrestling rankings, rising to a career-best 4th position in women's 58kg category.

రియో కాంస్య పతక విజేత మరో ఘనత

Posted: 09/12/2016 06:59 PM IST
Wrestler sakshi malik takes 4th spot in world rankings

రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత రెజ్లర్ సాక్షి మాలిక్ ర్యాంక్ మెరుగుపడింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్స్లో సాక్షి టాప్-5లో ప్రవేశించింది. మహిళల 58 కిలోల కేటగిరిలో సాక్షి నాలుగో ర్యాంక్ సాధించింది. ఆమెకిదే కెరీర్ బెస్ట్ ర్యాంక్ కావడం విశేషం. ఒలింపిక్స్లో రెజ్లింగ్ కేటగిరిలో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్గా సాక్షి ఘనత సాధించిన సంగతి తెలిసిందే.

రియో ఈవెంట్లో ఆమె కాంస్యం గెలిచి దేశానికి తొలిపతకం అందించింది. రియో విజయంతో ఆమె ర్యాంక్ మెరుగుపడింది. తాజా ర్యాంకింగ్స్ 48 కిలోల కేటగిరి జాబితాలో మరో భారత రెజ్లర్ వినేష్ పొగట్ రెండు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఇక పురుషుల ఫ్రీస్టయిల్ కేటగిరిలో సందీప్ తోమర్ (15వ ర్యాంక్), బజ్రంగ్ పూనియా (18వ ర్యాంక్) మాత్రమే టాప్-20లో నిలిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sakshi Malik  United World Wrestling rankings  wrestling  paralympics  

Other Articles