రియో పారా ఒలంపిక్స్ లో సత్తా చాటుతున్న క్రీడాకారులు India pockets second gold medal in para olympics

India pockets second gold medal in para olympics

devendra jhajharia, paralympics games, paralympic games india, devendra jhajharia gold, paralympics medals, paralympics gold medals, paralympics javelin throw, india javelin throw gold, devendra jhajharia javelin throw, india paralympics, rio paralympics 2016, sports news

avelin thrower Devendra Jhajharia had bettered his earlier record throw of 62.15 metres which had earned him a gold in the 2004 Athens Paralympics.

రియో పారా ఒలంపిక్స్ లో సత్తా చాటుతున్న క్రీడాకారులు

Posted: 09/14/2016 06:47 PM IST
India pockets second gold medal in para olympics

రియో పారా ఒలింపిక్స్లో భారతీయ దివ్యాంగ క్రీడాకారులు తమ సత్తాను చాటుతున్నారు. రియోలో ఒక రజతం, కాంస్యంతో సరిపెట్టుకున్న భారత్.. పారా ఒలంపిక్స్ లో మాత్రం దూసుకుపోతుంది. రియో ఒలంపిక్స్ లో షట్లర్ విసీ సిందూ రజత పతకం సాధించగా, రెజ్లర్ సాక్షి మాలిక్ క్యాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. దీపా కాసింతలో పతకాన్ని చేజార్చుకుంది. కానీ మిగత ఏ ఒక్క క్రీడాకారులు కూడా ప్వర్ణం పతకాన్ని సాధించలేకపోయారు. అయితే రియో పారా ఒలంపిక్స్ లో మాత్రం అందుకు భిన్నంగా సాగుతుంది.

అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న ఆటగాళ్లు సాధించలేని ఘనతను దివ్యాంగులు సాధించి దేశ పరువు ప్రతిష్ఠలను నలుదిశలా ఇనుమడింపజేస్తున్నారు. రెండు స్వర్ణ పతకాలను ఇప్పటికే తమ ఖాతాలోకి వేసుకున్న క్రీడాకారులు.. మరో రజత, కాంస్య పతకాన్ని కూడా సాధించిన విషయం తెలిసిందే. హైజంప్ లో తమిళనాడుకు చెందిన ఆటగాడు భారత్ కు రియో పారా ఒలింపిక్స్ లో తొలి స్వర్ణ పతకం సాధించాడు.

తాజాగా జావెలిన్ త్రోలో దేవేంద్ర ఝుఝురియాకు స్వర్ణ పతకం వచ్చింది. 63.97 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరిన ఝుఝురియా ఇప్పటి వరకు జావెలిన్ త్రోలో భారత ఆటగాళ్లు ఎవరూ చేయలేని ప్రదర్శనను చేయడం విశేషం. కాగా, ఈ పతకంతో రియో పారా ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటి వరకు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : devendra jhajharia  paralympics games  india  gold medal  javelin throw  rio paralympics  

Other Articles