US Open 2015: Leander Paes and Martina Hingis win historic mixed doubles title

Leander paes martina hingis win us open 2015 mixed doubles title

us open 2015, us open, leander paes, saina leander paes, sania, Indian shuttler, Indo-Swiss pair, us open mixed doubles title, martina win finals, Martina Hingis, sania into us open doubles final, sania into us open mixed doubles final, tennis news, tennis

Leander Paes created history by winning the U.S. Open mixed doubles title with Swiss partner Martina Hingis and surpassed compatriot and former partner Mahesh Bhupathi’s record.

యూఎస్ ఓపెన్: మిక్సిడ్ డబుల్స్ లో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న పేస్ జోడి

Posted: 09/12/2015 04:46 PM IST
Leander paes martina hingis win us open 2015 mixed doubles title

యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఇండియన్ స్టార్ షెట్లర్ లిమాండర్ పేస్ జోడీ టైటిల్ ను కైవసం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్, స్విట్జర్లాండ్ భామ మార్టినా హింగిస్ జోడీ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. ఒకే ఏడాది మూడు మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గి, పేస్-హింగిస్ జోడీ చరిత్ర సృష్టించింది. నిన్న తమ ప్రత్యర్థులను ఓడించి ఫైనల్స్ కు దూసుకువచ్చిన పేస్ జోడి.. ఫైనల్స్ మ్యాచ్లో 6-4, 3-6, 10-7 తేడాతో అమెరికా జోడీ సామ్ కెర్రీ - బెథానీ మాటెక్ లపై విజయం సాధించింది. ఈ ఏడాది వింబుల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్లు కూడా ఈ జోడీ కైవసం చేసుకుంది.

తాజా విజయంతో 1969 తర్వాత ఓ క్యాలెండర్ ఏడాదిలో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో 3 గ్రాండ్ స్లామ్లు నెగ్గిన జంటగా పేస్-హింగిస్లు చరిత్ర సృష్టించారు. పేస్కు ఇది 17వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా, స్విస్ స్టార్ మార్టినా హింగిస్ తన ఖాతాలో 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. హింగిస్ ఈ ఏడాది నాలుగు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించగా, అవన్నీ భారతీయ భాగస్వాములతోనే నెగ్గడం గమనార్హం. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో పేస్కు ఇది 9వ గ్రాండ్ స్లామ్ టైటిల్. భారత్ తరపున వెటరన్ షెట్లర్ మహేష్ భూపతి సాధించిన 8 టైటిల్ లను ఇదివరకే సమం చేసిన పేస్.. దీంతో ఆయనను అధిగమించాడు. కాగా, అత్యధికంగా టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా ఖాతాలో 10 టైటిల్స్ ఉన్నాయి. మరో టైటిల్ సాధిస్తే ఈ విభాగంలోనూ పేస్ తన రికార్డు మెరుగుపర్చుకునే అవకాశం ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles