indians shuttlers crashes out of Japan Open

Kashyap crashes out of japan open

parupalli kashyap, saina nehwal, HS Prannoy, PV sindhu, badminton, japan open, parupalli kashyap,india badminton, badminton india, p kashyap, p v sindhu, sindhu, jwala gutta, ashwini ponnappa, gutta-ponnappa, saina nehwal, japan open, japan open badminton, japan open news, badminton news, badminton

indian team fight has been end in japan super series badminton championship as the last hope Parupalli kashyap lost his game to sixth seed china china Thaipae in straight games

జపాన్ ఓపెన్ ముగిసిన భారత్ పోరు

Posted: 09/11/2015 07:20 PM IST
Kashyap crashes out of japan open

టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటర్ క్రీడాకారులు ఒక్కోక్కరుగా వెనుదిరిగి ఇంటిముఖం పట్టడంతో భారత్ పోరు ముగిసింది. క్రితం రోజు జరిగిన మ్యాచ్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్, ఇండియన్ స్టార్ షట్లర్ సైనా నేహ్వాల్ ఓటమి, అంతకు ముందు తెలుగుతేజం పీవీ సిందూ, మహిళల డబుల్స్ జంట గుత్తా జ్వాల - అశ్వనిపొన్నప్ప జంట.. పురుషుల విభాగంలో కదంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణాయ్ లు వెనుదిరగారు.

అయినా.. పారుపల్లి కశ్యప్ పై కొండంత ఆశలు పెట్టుకున్నారు భారత టెన్నీస్ అబిమానులు. అయితే ఇవాళ ఆయన కూడా భారత షెట్లర్ల బాటలోనే పయనించడంతో భారత్ పోరు ముగిసింది. ఇవాళ ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఎనిమిదో సీడ్ పారుపల్లి కశ్యప్.. ఆరో సీడ్ తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ) చేతిలో 14- 21, 18- 21 తేడాతో ఓటమిచెందాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ కశ్యప్ కు అవకాశం దక్కనీయకుండా చెన్ ధాటిగా ఆడాడు. ఈ పరాజయంతో భారత జట్టులోని ఏ ఒక్కరు కూడా కనీసం సెమీస్ కు చేరుకోకుండానే ఇంటిదారి పట్టినట్లయింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parupalli kashyap  saina nehwal  badminton  japan open  

Other Articles