PV Sindhu ousted out of World Badminton quarters

Pv sindhu crashes out of world badminton championship

badminton world championships, world championships, PV Sindhu, Saina Nehwal,, Li Xuerui, gutta jwala, ashwini, kashyap, pranay, badminton results, pv sindhu, pv sindhu india, k srikanth, srikanth, badminton championships news, badminton news, sports news, badminton, latest Badminton news

PV Sindhu crashes out of World Badminton Championship following her QF defeat to Sung Ji Hyun. She lost 17-21, 21-19, 16-21.

ప్రపంచ ఛాంపియన్ షిప్ నుంచి సింధూ నిష్క్రమణ

Posted: 08/14/2015 07:00 PM IST
Pv sindhu crashes out of world badminton championship

ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్స్ లో ఒలంపిక్ మెడల్ విన్నర్ చైనా క్రీడాకారణి లీ జురుయ్ ను ఓడించి యావత్ బ్యాడ్మింటన్ క్రీడాలోకాన్ని నివ్వరపర్చిన సింధూ.. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. 8వ సీడ్ కొరియన్ షట్లర్ సుంగ్ చేతిలో 17-21, 21-19, 16-21 తేడాతో సింధు ఓటమి పాలైంది.

తొలి సెట్ కోల్పోయిన సింధు ఆ తర్వాత పుంజుకుని రెండో సెట్ గెలిచింది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఖచ్చితంగా రాణించాల్సిన సింధూ కాస్తా తడబాటుకు గురైంది. ఈ తరుణంలో 16-21 తేడాతో వెనుకబడింది. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ నుంచి నిష్క్రమించింది. గతంలో వరుసుగా రెండుసార్లు కాంస్య పతకాలు సాధించిన సింధు ఈసారి క్వార్టర్‌ ఫైనల్లోనే వెనుదిరగడంతో అభిమానులు నిరాశ చెందారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : badminton  PV Sindhu  Sung Ji Hyun. World Badminton Championship  

Other Articles