Saina Nehwal, PV Sindhu advances to World Badminton quarters

Saina nehwal pv sindhu reach world badminton quarters

badminton world championships, world championships, PV Sindhu, Saina Nehwal,, Li Xuerui, gutta jwala, ashwini, kashyap, pranay, badminton results, pv sindhu, pv sindhu india, k srikanth, srikanth, badminton championships news, badminton news, sports news, badminton, latest Badminton news

Indian badminton queens Saina Nehwal and PV Sindhu earned contrasting wins to enter the women's singles quarterfinals of the World Championships here on Thursday.

ప్రపంచ ఛాంపియన్ షిప్ క్వార్టర్స్ లోకి సైనా, సింధు

Posted: 08/13/2015 06:07 PM IST
Saina nehwal pv sindhu reach world badminton quarters

భారత్ స్టార్ షట్లర్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇండోనేషియా రాజధాని జకర్తా వేదికగా జరుగుతున్న ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లో జపాన్ క్రీడాకారిణి సయాక తకహషిపై 21-18, 21-14 తేడాతో విజయం సాధించింది. 14వ సీడ్ ప్లేయర్పై జరిగిన ఈ మ్యాచ్ లో రెండో సీడ్ సైనా వరుసగా రెండు సెట్లు కైవసం చేసుకుని 42 నిమిషాల్లోనే విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి గేమ్ లో 7-0 తో వెనుకంజలో ఉన్న సైనా ఆ తర్వాత పుంజుకుంది.

అత్భుత పోరాట పటిమను ప్రదర్శించి సెట్ ను గెలిచింది. ఇప్పటి వరకూ ఒక్క పతకాన్ని గెలవని సైనా ఈ సారి మాత్రం పతకంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. నిన్న జరిగిన ప్రీక్వార్టర్ పైనల్స్ మ్యాచ్‌లోనూ సైనా 21-13, 21-9తో వరుస గేముల్లో చెంగ్‌ నాన్‌ యి (హాంకాంగ్‌)పై విజయం సాధించింది. సైనా ఈ ఏకపక్ష మ్యాచ్‌ ను కేవలం 33 నిమిషాల్లోనే ముగించింది.

మరోవైపు తెలుగుతేజం పీవీ సింధూ యావత్ ప్రపంచాన్ని నివ్వరపరుస్తూ క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. పీవీ సింధు ప్రపంచ మూడో సీడ్ క్రీడాకారిణి ,చైనాకు చెందిన లీ జ్యూరీని ఓడించి క్వార్టర్స్: లోకి దూసుకెళ్లింది.  లీ జ్యూరీతో జరిగిన మ్యాచ్ లో అమెను 50 నిమిషాల్లో ఓడించి విజయాన్ని నమోదు చేసుకుంది. లీ జ్యరీతో తలపడిన నాలుగు మ్యాచ్ లలో సైనాకు రెండు పర్యాయాలను విజయం సాధించింది. లీ జ్యురీపై 21-17, 14-21, 21-17 స్కోరుతో ఓడించిన సింధు క్వార్టర్స్ లోకి ప్రవేశించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : badminton  PV Sindhu  Saina Nehwal  Li Xuerui  World Badminton Championship  

Other Articles