P V Sindhu, K Srikanth off to winning starts at world badminton championships

Pv sindhu kidambi srikanth advance in world championships

badminton world championships, badminton results, pv sindhu, pv sindhu india, k srikanth, srikanth, badminton championships news, badminton news, sports news, badminton, PV Sindhu, Kidambi Srikanth Advance In World Championships, latest Badminton news

World No. 13 P V Sindhu won her match 11-21 21-17 21-16; Srikanth won 21-10 21-13 in just 24 minutes

ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత్ ముందంజ

Posted: 08/11/2015 09:48 PM IST
Pv sindhu kidambi srikanth advance in world championships

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో తెలుగు తేజాలు పీవీ సింధు,కిడాంబి శ్రీకాంత్ రాణిస్తున్నారు. ఇవాళ జరిగిన మహిళల మ్యాచ్ లో మూడో రౌండ్ లోకి పీవీ సింధూ, పురుషుల సింగిల్స్ లో రెండో రెండో లోకి కిడాంబి శ్రీకాంత్ ప్రవేశించారు. లైని జార్స్ ఫెల్డ్పై 11-21, 21-17, 21-16 తేడాతో సింధూ విజయాన్ని సాధించింది. తొలి సెట్ కొద్దిగా వెనకంజ వేసిన సింధూ ఆ సెట్ ను కోల్పోయింది. ఈ తరువాత భారత స్టార్ షట్లర్ పుంజుకుని విజృంభించింది. గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసిన సింధూ పదకొండో సీడ్ గా బరిలోకి దిగిన విషయం విదితమే. 50 నిమిషాల పాటు జరిగిన పోరులో లైని జార్స్ ఫెల్డ్పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. మూడో రౌండ్లో ఒలింపిక్ చాంపియన్, మూడో సీడ్ క్రీడాకారిణి లీ ఝరయ్తో తలపడనుంది.

అటు పురుషుల సింగిల్స్లో మూడో సీడ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఆస్ట్రేలియాకి చెందిన మైఖెల్ ఫారిమన్ పై 21-10, 21-13 తేడాతో ఘన విజయాన్ని సాధించాడు. రెండు గేముల్లోనూ తన ఆధిక్యాన్ని ప్రదర్శించి కేవలం 24 నిమిషాల్లోనే ప్రత్యర్ధి ఆటకట్టించాడు. చైనీస్ తైపేయి ఆటగాడు హ్సు జెన్ హోతో తలపడనున్నాడు. గతేడాది జరిగిన డెన్మార్క్ ఓపెన్లో వీరిద్దరి మధ్య జరిగిన ఏకైన మ్యాచ్ లో గెలుపొందడం శ్రీకాంత్ కు కలిసొచ్చే అంశం.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : badminton  world championships  pv sindhu  k srikanth  

Other Articles