Australian stuntman uses motorbike to surf waves in Tahiti

A daredevil in tahiti

Australian stuntman uses motorbike to surf waves in Tahiti, robbie maddison, surf, tahiti, waves, motorbike, stuntman, Australia,Australia and the Pacific, Australian motorcycle stuntman,Australian motorcycle stuntman, ride waves at Teahupoo, World News, News

Robbie Maddison, an Australian motorcycle stuntman and James Bond double, spent two years preparing his motorbike to ride waves at Teahupoo in Tahiti

బైక్ తో సర్పర్ సాహసం.. ఆశ్చర్యంలో క్రీడాలోకం

Posted: 08/05/2015 06:39 PM IST
A daredevil in tahiti

సాహసం చేయరా డింబకా అన్న నానుడిని బాగానే ఒంటపట్టించుకున్న అస్ట్రేలియాకు చెందిన సర్ఫర్ సర్ఫర్ రోబీ మాడిషన్ భయంకర సాహసానికి ఒడికట్టాడు. సముద్రంలోని భీకర అలలపై మోటార్ బైక్‌తో సర్ఫింగ్ చేస్తూ ప్రాపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాడు. ప్రపంచంలో ఇలాంటి విన్యాసం చేసిన తొలి వ్యక్తిగా 34 ఏళ్ల మాడిషిన్ చరిత్ర సృష్టించాడు. ఒళ్లు గగుర్పొడిచే విడియోను ‘పైప్ డ్రీమ్’ పేరిట విడుదల చేశాడు. ఈ వీడియోను చూసి ప్రపంచ ప్రేక్షకులందరూ మంత్ర ముగ్ధులైనట్టు సర్ఫర్ మేగజైన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో చెప్పాడు.
 
ఈ ఫీట్ చేయడానికి మాడిషన్ రెండేళ్లపాటు కఠోరంగా సాధన చేశాడట. ఈ ఫీట్ కోసం 250 ఎస్‌ఎక్స్ డర్ట్ బైక్‌ను ఉపయోగించానని తెలిపాడు. కాగా బైక్‌పై తన బాడీ బరువు ఎక్కువగా పడకుండా లైఫ్ జాకెట్ ధరించానని, హెల్మెట్‌లో సర్ఫ్ నురగను వాడానని చెప్పాడు. కాగా, కొన్ని భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకున్నట్టు వివరించాడు. ఇక ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన మాడిషన్ చాలా హాలీవుడ్ సినిమాల్లో నటించాడు. ఇలాంటి ఎన్నో సాహసోపేతమైన ఫీట్లు చేసి ప్రేక్షకులను అలరించాడు. కాగా, డేనియల్ క్రేగ్ జేమ్స్‌బాండ్‌గా నటించిన స్కై ఫాల్ చిత్రంలో కూడా మాడిషన్ పలు సాహసాలు చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : robbie maddison  surf  tahiti  waves  motorbike  stuntman  Australia and the Pacific  

Other Articles