Lionel Messi's family 'attacked in stadium' during Argentina's Copa America final loss to Chile

Lionel messi s family attacked in stands of copa america final

Lionel Messi's family attacked in stands of Copa America final, Lionel Messi, Chile football team, Argentina football team, Copa America, lionel messis, heckled, copa america, chile, final match, argentina vs chile, Rodrigo

Members of Lionel Messi's family were attacked in the stands in Santiago during the Copa America final between Argentina and Chile, Goal.com reports.

క్రీడాస్ఫూర్తికి పరాకాష్ట.. మెస్సీ కుటుంబసభ్యులపై దాడి..

Posted: 07/05/2015 01:59 PM IST
Lionel messi s family attacked in stands of copa america final

అభిమానం అదుపు తప్పింది, క్రీడాస్పూర్తి మంటగలిసింది. ఎంత తమ జట్టు గెలవాలన్న ఆశ వున్నా.. గెలుపు కారణమైన క్రీడాకారుడిని, అతని కటుంబ సభ్యులపై దాడులకు పాల్పడటం ఎలా న్యాయమనిపించుకుంటుందో.. దాడులకు పాల్పడిన వారికే తెలియాలి. ఇరు దేశాలకు చెందిన అభిమానులు దెబ్బలాడుకోవడం చూశాం, విన్నాం. కానీ అత్యంత దారుణంగా ఒక జట్టు గెలుపుకు కారణమైన ఆటగాడిపై ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు దాడులకు తెగబడటం ఎక్కడి ధర్మం. కానీ ఇదే జరిగింది. ఇరు జట్ల అభిమానులు పరస్పరం దూషించుకున్నారు. అంతటితో ఆగకుండా ఆటగాళ్లకు చెందిన కుటుంబసభ్యులపై దాడులకు తెగబడ్డారు. ఇది కోపా అమెరికా పుట్ బాల్ టోర్నీలో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ అడుతున్న శాండియాగోలోని ఎస్టాడియో నేషనల్ స్టేడియంలో చోటుచేసుకుంది.

మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరు జట్లూ అద్భుతంగా రాణించాయి. ఫలితంగా ఏ ఒక్కరు గోల్ సాధించలేకపోయారు. చివరికి షూట్ అవుట్ ద్వారా అతిధ్య చిలీ జట్టు 4-1 తేడాతో విజేతగా నిలిచింది. కాగా, పస్ట్ హాఫ్ విరామంలో మ్యాచ్ చూసేందుక వచ్చిన అర్జెంటటినీ కెప్టెన్ లియోనెల్ మెన్సీ కుటుంబసభ్యలను ఉద్దేశించి కొందరు చిలీ అభిమానులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కోపోద్రిక్తుడైన మెస్సీ సోదరుడు రోడ్రిగో ఘాటుగా ప్రతిస్పందించాడు. దీంతో ఇరు బృందాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఒక దశలో మెస్సీ కుటుంబసభ్యులను చిలీ అభిమానులు తోసివేసినట్లు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు మెస్పీ సోదరుణ్ని టీవీ క్యాబిన్ కు తరలించారు. మిగతా మ్యాచ్ ను అక్కడి నుంచే వీక్షించాలని, గ్యాలరీలోకి వెళ్లోద్దని రోడ్రిగోను పోలీసులు అభ్యర్థించారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరనీ అదుపులోకి తీసుకోలేదని తెలిసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lionel messis  heckled  copa america  chile  final match  copa america vs chile  

Other Articles