Poverty makes national boxer work as sweeper in Kolkata

From boxer to sweeper krishna raut is a story of national shame for india

krishna raut, ex-pugilist turns sweeper, hmc, howrah municipal, penury, sports news, sports, boxing news, boxing, gold medalist, All-India Invitational Boxing Championship gold medalist, Surya Sen Trophy gold medalist, temporary worker, Howrah Municipal Corporation, West Bengal State Open Lalchand Roy Memorial Boxing Championship runner up

Krishna Raut, who won the gold medal in All-India Invitational Boxing Championship (the Surya Sen Trophy) in 1987 and the runnerup trophy in 1992, earns Rs 232 per day as a temporary worker in the Howrah Municipal Corporation.

స్వర్ణ పతకాన్ని సాధించిన నాటి బాక్సర్.. నేడు చీపురు పట్టుకున్నాడు

Posted: 07/04/2015 06:30 PM IST
From boxer to sweeper krishna raut is a story of national shame for india

గుర్తింపు లేని క్రీడల్లో ఎంతగా రాణించినా.. ఆ గుర్తింపు ఆప్పటి వరకే. కాలగమనంలో వారు సాధించిన కీర్తి కిరీటాలు.. తీసుకువచ్చిన పతకాలన్నీ కూడా చరిత్రకే పరిమితం అవుతాయి. పతకాలను సాధించిన క్రమంలో అభినందనలు తెలిపే నేతలకు కోదవ లేదు. అంతేకాదు అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పే నేతల ప్రసంగాలకు కూడా తక్కువేం లేదు. అయితే వాటిని నమ్మి.. అవి సాధ్యపడతాయనకుంటే.. నమ్మి నానబోసినట్లే అవుతుందనడానికి ఈ కృష్ణా రౌత్ ఇతివృత్తమే నిదర్శనం. ఇంతకీ ఈ కృష్ణ రౌత్ అనేగా మీ సందేహం.

15 ఏళ్ల ప్రాయంలోనే బాక్సింగ్ లో దేశానికి బంగారు పతకాన్ని సాధించిన భాక్సర్ ఆయన. ఇప్పుడు దినసరి కూలీగా మరి రోజుకు 232 రూపాయలకు హౌరా మున్సిపాలిటీలో స్వీపరుగా కూలీ చేస్తున్నాడు. 1987లో ఆల్ ఇండియా ఇన్విటేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో నాలుగు పర్యాయాలు తలపడ్డాడు. తొలిసారి 1985 బాక్సింగ్ లో తలపడ్డారు.  ఆరు మరుసటి రెండేళ్లకు మరోమారు వచ్చిన పోరులో రన్నర్ అప్ గా నిలిచాడు. ఆ తరువాత విజేతగా నిలిచాడు. ఆ మురుసటి పర్యాయం మరోమారు రన్నర్ అప్ గా నిలిచాడు.

అలా ఆయన బాల్యం, యవ్వన ధశలోనే దేశానికి గర్వకారణంగా మారాడు. కాలం మారింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి దయనీయంగా మారింది. కుటుంబ పోషణ కోసం, తన ఇద్దరు బిడ్డల కోసం, టీబి వ్యాధిగ్రస్తుడైన తన సోదరుడి కోసం ఏదో ఒక పని చేసి కుటుంబానికి ఆసరా కావాలనకున్నాడు. చిన్ననాటి నుంచి బాక్సింగ్ పై ఆసక్తితో చదవు కూడా అబ్బలేదు. దీంతో ఆయన పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మినట్లుగా తనను కీర్తించిన చోటే.. స్వీపరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తు అష్టకష్టాలు పడుతున్నాడు. అంతేకాదు బాక్సింగ్ పట్ల ఆస్తక్తి వున్న చిన్నారులకు శిక్షణ కూడా ఇస్తున్నాడు. తనకు శాశ్వతమైన జీవనభృతి కల్పిస్తే తన పిల్లలను బాగా చదివించుకుంటానని అని వేడుకుంటున్నాడు ఈ మాజీ బాక్సర్.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles