Saina nehwal shares her feelings on china open super series title won

saina nehwal, saina nehwal china open, saina nehwal hot photos, saina nehwal interview, saina nehwal hot photo shoot, saina nehwal press meet, saina nehwal photo gallery, saina nehwal, coach gopichand, coach vimal kumar, indian sports persons, telugu news

saina nehwal shares her feelings on china open super series title won

చైనా ఓపెన్ విజయం వెనుక దాగివున్న రహస్యాలు...

Posted: 11/20/2014 11:11 AM IST
Saina nehwal shares her feelings on china open super series title won

వరుసగా పరాజయాలను ఎదుర్కొంటూ ఇన్నాళ్లవరకు భారతీయ అభిమానులను నిరాశపరిచిన సైనానెహ్వాల్... ఎంతోకష్టతరమైన చైనా ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే! ఇందులో ప్రపంచ దిగ్గజ బ్యాడ్మింటన్ స్టార్ అయిన జపాన్ క్రీడాకారిణిని అకానెను ఎంతో సునాయాసంగా ఓడించింది. దాదాపు 42 నిముషాలపాటు జరిగిన ఆ మ్యాచులో సైనా 21-12, 22-20 స్కోరుతో అకానెపై విజయం సాధించింది. ఈమె సాధించిన ఈ విజయాన్ని భారతీయ అభిమానులతోపాటు బ్యాడ్మింటన్ ప్రముఖులు సంబరాలు చేసుకున్నారు.

అయితే సైనా ఇంతటి భారీ విజయం అందుకోవడం వెనుక గల కారణాలను బయటపెట్టేసింది. అసలు తానీ టైటిల్ ను గెలుచుకునేదానిని కాదని.. అనుకోకుండా బరిలోకి దిగిన అనంతరం తానీ విజయం సాధించుకోగలిగానని.. ఈ విజయం వెనుక ఒక వ్యక్తి సలహాలు వున్నాయని అమ్మడు పేర్కొంటోంది. ఈ విషయాల గురించే సైనా మాట్లాడుతూ.. ‘నిజానికి నేను చైనా ఓపెన్ ఆడాలని అనుకోలేదు. ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత ట్రైనింగ్‌కు సమయం సరిపడా లేదు. కానీ కోచ్ విమల్ కుమార్ ఈ సూపర్ సిరీస్ ఆడాల్సిందేనని నన్ను ఒత్తిడి చేశారు. వరుసగా ఓటములతో సతమతమవుతున్న నన్ను.. ఈ టోర్నీలో గెలుస్తానన్న నమ్మకాన్ని పెంచి ఆడేందుకు ఉత్సాహపరిచాడు. ఆయన చెప్పడం వల్లే నేను బరిలోకి దిగి, టైటిల్ ని సాధించుకోగలిగాను’’ అని అంటోంది. అమ్మడు.

అలాగే తాను సాధించిన విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘ చైనా ఓపెన్ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే అన్ని టోర్నీల్లోకి ఇది చాలా క్లిష్టం. ఓ రకంగా ఇది కల నిజమైన క్షణం. నా జీవితాంతం గుర్తుండిపోయే విజయం ఇది. ఈ ఆటలో నాతో కలిసి కష్టపడినందుకు విమల్ సర్‌కు కృతజ్ఞతలు. నా ఆటలో కొంత వైవిధ్యం తెచ్చేందుకు ఆయన ప్రయత్నించారు’’ అని పేర్కొంది. గతంలో గోపీచంద్ శిష్యురాలిగా చాలాకాలం వరకు కొనసాగిన సైనా.. అప్పట్లో కొన్ని విభేదాల కారణంగా ఆయనతో విడిపోయిన విషయం తెలిసిందే! అతని నుంచి దూరమైన అనంతరం కోచ్ విమల్ దగ్గర శిక్షణ పొందుతోంది. ఆయన దగ్గర శిక్షణ పొందుతున్నందుకు తాను సంతోషంగా వుందని... ఇక ఆయనతోనే కొనసాగుతానని వెల్లడించింది. అంటే.. గోపీతో కలిసే అవకాశాలు ఇక లేనట్టే!

AS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saina nehwal  coach gopichand  indian sports persons  telugu news  china open series  

Other Articles