Saina nehwal won china open title against japanese player and kidambi srikanth also win against great player lin dan

saina nehwal, saina nehwal latest news, saina nehwal hot photos, saina nehwal hot photo shoot, saina nehwal latest photo shoot, saina nehwal china open title, saina nehwal won china open title, kidambi srikanth china open title, lin dan player

saina nehwal won china open title against japanese player and kidambi srikanth also win against great player lin dan

భారత ప్రియులకు సైనా నెహ్వాల్ బంపరాఫర్!

Posted: 11/17/2014 05:35 PM IST
Saina nehwal won china open title against japanese player and kidambi srikanth also win against great player lin dan

చాలారోజుల తర్వాత భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇండియన్ అభిమానులకు ఒక బంపరాఫర్ ను ప్రసాదించింది. ఎన్నాళ్లనుంచో వేచిచూసిన ఆ క్షణాలు తిరిగి సైనా జీవితంలో తిరిగి వచ్చినట్లున్నాయి... అందుకే చాన్నాళ్ల తర్వాత ఆమె తనదైన శైలిలో భారత్ కు ఒక ఆపర్ ఇచ్చింది. ఆ ఆఫర్ ఏంటని అనుకుంటున్నారా..? మరేం లేదండి.. గతకొన్నాళ్ల నుంచి పేలవ పెర్ ఫార్మెన్స్ తో వరుసగా పరాజయపాలవుతున్న సైనా నెహ్వాల్.. చాలాకాలం తర్వాత ఆదివారం చైనా ఓపెన్ టైటిల్ ను తన సొంతం చేసుకుంది. తను గెలిచిన ఆ విజయాన్ని బారత్ కు, బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ఆమె అంకితమిచ్చింది.

చైనా ఓపెన్ లో మహిళల సింగిల్స్ లో పాల్గొన్న సైనా నెహ్వాల్.. మొదటి ఆటనుంచి అద్భుతంగా ప్రదర్శించింది చివరకు టైటిల్ గెలుచుకుంది. మహిళల సింగిల్స్ లో సైనా 21-12, 22-20 స్కోరుతో జపాన్ క్రీడాకారణి అయిన అకానె యమగూచిని ఓడించింది. 42 నిముషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. సైనాకు ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు. తొలి గేమ్ లో సైనా ఆధిపత్యం చెలాయించినా.. రెండో గేమ్ లో మాత్రం ఆమెకు అకానె నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రెండో గేమ్ లో వేగాన్ని పుచ్చుకున్న ప్రత్యర్థి 13-9తో ఆధిక్యంలో నిలిచింది. ఆ దశలో సైనా తన అనుభవాన్ని ఉపయోగించి, స్కోరును సమం చేసింది. అయితే తలో పాయింట్ గెలుస్తూ వెళ్లడంతో 20-20కి స్కోరు చేరుకుంది. అంతే! ఎవరు గెలుస్తారోనన్న ఒక్కటే టెన్షన్. ఆ సమయంలో సైనా వరుసగా రెండు పాయింట్లతో గేమ్ ను, మ్యాచ్ ను తన సొంతం చేసుకుని.. చైనా ఓపెన్ టైటిల్ ను గెలుచుకుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సైనా ఆడిన ఆరు చైనా ఓపెన్ లో ఇదే తొలి విజయం. ఈమె గెలిచిన అద్భుత విజయాన్ని సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.

మరోవైపు కిదాంబి శ్రీకాంత్, అగ్రగణ్యుడైన లిన్ డాన్ ను బ్యాడ్మింటన్ క్రీడలో ఓడించి.. సరికొత్త చరిత్రను సృష్టించాడు. 21ఏళ్ల వయస్కుడైన ఇతను.. 13 ఏళ్లలో ఓ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్ చేరి, ఓ మహాద్భుతానికి తెరతీశాడు. చైనా దిగ్గజ ఆటగాడు లిన్ డాన్ ను వరుస గేముల్లో 21-19, 21-17తో మట్టికరిపిస్తూ కెరీర్ లో తొలి విజయాన్ని అందుకున్నాడు. 46 నిముషాలపాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో.. శ్రీకాంత్ అద్భుతంగా ప్రదర్శించాడంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వెల్లువలు కురుస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saina nehwal  kidambi srikanth  china open title  badminton player lin dan  telugu news  

Other Articles