Kidambi srikanth creates another history by defending china badminton star chou tien chen in hongkong open series

kidambi srikanth news, kidambi srikanth latest news, kidambi srikanth china open title, kidambi srikanth china open series, kidambi srikanth hongkong open series, kidambi srikanth hongkong open title, kidambi srikanth news, china badminton star chou tien chen

kidambi srikanth creates another history by defending china badminton star chou tien chen in hongkong open series

శ్రీకాంత్ సంచలనం.. మరో దిగ్గజ ఆటగాడు చిత్తు!

Posted: 11/20/2014 11:43 AM IST
Kidambi srikanth creates another history by defending china badminton star chou tien chen in hongkong open series

చైనా ఓపెన్ సూపర్ సిరీస్ లో భాగంగా ఫైనల్లో దిగ్గజ షట్లర్ లిన్’డాన్’ను ఓడించి సరికొత్త చరిత్రను సృష్టించిన భారత బ్యాడ్మింటన్ కిదాంబి శ్రీకాంత్.. అటువంటి సంచలనాన్నే మరోసారి సాధించాడు. ప్రపంచ ర్యాంకుల్లో 16వ స్థానాన్ని కైవసం చేసుకున్న ఈ యువకిశోరం.. 8వ ర్యాంకు ఆటగాడిని ఓడించి తన సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియపరిచాడు. తన ఆటతీరుతో ప్రపంచదిగ్గజ బ్యాడ్మింటన్ స్టార్లను చిత్తుచేస్తూ.. వారికి రాత్రుల్లో నిద్రపట్టనివ్వకుండా చేస్తున్నాడు.

ప్రస్తుతం హాంకాంగ్ ఓపెన్ సిరీస్’లో కొనసాగుతున్న శ్రీకాంత్.. అందులో భాగంగా పురుషుల్ సింగిల్స్ తొలిరౌండ్లో అతను ఏడో సీడ్ చౌ-టియెన్-చెన్ (చైనీస్ తైపీ)ని ఓడించాడు. బుధవారం ఎంతో హోరాహోరీగా కొనసాగిన ఈ మ్యాచ్ లో శ్రీకాంత్ 18-21, 22-20, 21-16 స్కోరుతో అద్భుత విజయాన్ని సాధించాడు. తొలిరౌండ్లో కాస్త వెనుకడుగు వేసిన శ్రీ.. తర్వాత రెండు రౌండ్లలో పుంజుకుని విజయం దక్కించుకున్నాడు.

తొలిగేమ్’లో ఓ దశలో 15-7స్కోరుతో శ్రీకాంత్ ఆధిక్యంలో వున్నా.. ఆ గేమ్’ను కోల్పోయాడు. అయితే రెండో రౌండ్’లో మాత్రం తన సత్తా ఏంటో నిరూపించాడు. ఓ దశలో 12-15తో వెనుకబడినా.. పుంజుకుని గేమ్ గెలిచాడు. ఇక మూడో గేమ్’లోనూ శ్రీ 6-10 స్కోరుతో వెనుకబడ్డాడు. అయితే తన అద్భుత ప్రదర్శనతో వరుసగా ఆరు పాయింట్లు సాధించి ఆ గేమ్’ను గెలిచాడు. ఇలా ఒక్కొక్క గేమ్’లో ఒక్కొక్కరకంగా ప్రదర్శిస్తూ... చివరకు విజయం సాధించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles