Pregnancy test for women boxers to participate in world championship

indian boxers, indian women boxers, indian boxing latest news, pregnancy test for women boxers, indian boxing association latest news, latest sports news, pregnancy test process, how to confirm pregnancy by own

pregnancy test for women boxers to participate in world championship : indian boxing association makes pregnancy test mandatory for women boxers to parcipate in world championship

పోటిలో పాల్గొనాలంటే ప్రెగ్నెన్సి టెస్ట్ కు రావాల్సిందే

Posted: 11/06/2014 01:42 PM IST
Pregnancy test for women boxers to participate in world championship

భారత స్పోర్స్ట్ అథారిటి (సాయ్) అప్పుడప్పుడూ వింత నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా మహిళా బాక్సర్ల కోసం ప్రత్యేకంగా ఓ నిబంధన తీసుకొచ్చింది. బాక్సింగ్ చాంపియన్ షిప్ లో పాల్గొనే మహిళా బాక్సర్లు గర్బ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని స్పష్టం చేసింది. కొత్త వివాదాస్పద నిర్ణయం ప్రకారం.., ప్రపంచ చాంపియన్ షిప్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న క్రీడాకారులకు గర్భ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి అని ప్రకటించింది. వారందరికీ పరీక్షలు చేయించాలని బాక్సింగ్ అసోసియేషన్ ను సాయ్ కోరింది.

ఈ వివాదాస్పద నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మహిళా క్రీడాకారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. తమ వ్యక్తిగత స్వేచ్ఛ, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలాంటి నిబంధనలు తీసుకురావటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ తరహా నిర్ణయాల వల్ల క్రీడాకారులకు పోటిలపై ఆసక్తి తగ్గుతుందని క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు. పెళ్లి కాని వారికి అయితే సరే... కాని పెళ్లి కాని వారికీ గర్భస్థ పరీక్షలు చేయించాలని చెప్పటం వారిని అవమానించటమే అవుతుంది.

అయితే ఈ విమర్శలు, నిరసనలు పట్టించుకోకుండా సాయ్ తన పని చేసుకుపోయింది. సాయ్ కు చెందిన వైద్యులతో మహిళా బాక్సర్లకు పరీక్షలు చేసింది. ఈ విధానం కాస్త ఇబ్బందిగా అన్పించినా.., అవమానంగా భావించకుండా దేశం కోసం భరించారు. పరీక్షలకు హాజరైన వారిలో పెళ్ళి అయిన వారితో పాటు, పెళ్లి కాని యువ బాక్సర్లు, మైనర్ అమ్మాయిలూ ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఏమి చేయలేక మౌనంగా పరీక్షలకు హాజరయ్యారు అని బాక్సింగ్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి.

వాస్తవానికి అంతర్జాతీయ నిబంధనల ప్రకారం కూడా.., గర్బ పరీక్షలు చేయించాలని నిబందన ఎక్కడా లేదు. యువతులు, పెళ్లి అయిన వారయితే.., ప్రెగ్నెన్సీ లేదు అని సొంతంగా దృవీకరించి డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. అదే మైనర్ క్రీడాకారులు అయితే వారి తల్లితండ్రులు/ సంరక్షకులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ మినహాయింపును పక్కనబెట్టిన సాయ్ మహిళా బాక్సర్లకు పరీక్షలు చేసి వారిని అవమానించింది అని విశ్లేషకులు చెప్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : boxers  pregnancy test  latest news  sports  

Other Articles