Iaba says it can t forgive indian boxer sarita devi

boxer sarita devi issue, boxer sarita devi on referees, sarita devi boxing allegations, iaba on sarita devi, sarita devi boxing career, sports latest news updates, iaba latest, indian boxers

iaba not forgive sarita devi : international amateur boxing assoation says they will not forgive sarita devi for making allegations on referees in asian games. saritha devi has to face punishment we will not leave her says seriously iaba

సరితపై కక్ష కట్టారు.. కెరీర్ నాశనం చేస్తున్నారు

Posted: 11/12/2014 05:55 PM IST
Iaba says it can t forgive indian boxer sarita devi


భారత మహిళా బాక్సర్ సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య కక్షగట్టింది. ఆమె తప్పు చేసిందనీ.. కాబట్టి శిక్ష అనుభవించక తప్పదు అని హెచ్చరిస్తోంది. సరితను సున్నాశాతం కూడా ఉపేక్షించమని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ఈమెపై నిరవధిక నిషేధం విధించగా.., ఇంతకంటే ఎక్కువ శిక్ష విధించటానికి కసరత్తు చేస్తోంది. ఫలితంగా బాక్సింగ్ పై మక్కువతో దేశానికి పతకం తేవాలన్న సరిత కలలు సమాధి అవుతున్నాయి. బోర్డు అర్ధం లేని పట్లు వల్ల సత్తా ఉన్న సామాన్య బాక్సర్ కెరీర్ నాశనం అవుతోంది.

ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగిన ఆసియా గేమ్స్ లో రిఫరీల తప్పుడు నిర్ణయాలతో మ్యాచ్ గెలిచినప్పటికీ ఓడినట్లు ప్రకటించారు. ఫలితంగా అమె కేవలం క్యాంస పతకం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే రెఫరీల నిర్ణయం వల్ల తాను రజిత గెలిచినా ఓడినట్లు ప్రకటించినందుకు నిరసనగా, పతకాల బహుకరణ సమయంలో తనకు జరిగిన అన్యాయాన్ని నిలదీసింది సరితా. పతకం బహుకరణకు వేదిక పైకి వచ్చిన అమె.. రోదిస్తూనే వుంది. మామూలుగా కాదు. చిన్న పిల్లలా తన భాధను వ్యక్తం చేసింది. రెఫరీలు ఇచ్చిన పతకాన్ని తీసుకున్న సరిత.. దానిని రజిత పతక విజేతకు అందించింది.

దీనికి అమె భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య(ఏఐబీఏ) వెల్లడించింది. సరితాదేవి, ముగ్గురు కోచ్‌లపై ఏఐబీఏ నిరవధిక నిషేధం విధించింది. అయితే ఈ విషయంపై తుదితీర్పు క్రమశిక్షణ సంఘం వద్ద పెండింగ్‌లో ఉంది. త్వరలోనే తీర్పు వెలువడుతుందని, సరితాదేవి కచ్చితంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఏఐబీఏ అధ్యక్షుడు సీకే వూ తెలిపారు. ఆమె తప్పును ఏమాత్రం కూడా క్షమించేది లేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఇంత వివాదానికి కారణమైన రెఫరీల నిర్ణయం సరైందేనా..? కాదా..? అని మాత్రం మరోసారి పరిశీలించడం లేదు.

సరితా దేవి పతాకాన్ని నిరాకరించి తప్పు చేసిందే అనుకుంటే.. రెఫరీలు తప్పు చేశారా..? తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించి వుంటే.. ఒలంపిక్ గేమ్స్ లో జరిగిన మ్యాచ్ ను మరోసారి పరిశీలించారా..? పరిశీలిస్తే.. రెఫరీలదీ సముచిత నిర్ణయమేనని తేలిందా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సింది పోయి.. సరితాదేవి పైనా వేటు వేసింది కాకుండా.. ఇంకా భారీ మూల్యం చెల్లించాల్సి వుస్తుందని హెచ్చరికలు చేయడం అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్యకు ఏవిధంగా న్యాయంగా అనిపిస్తుందో వారే చెప్పాలి. తప్పును ఎత్తిచూపిన పాపానికి జీవిత కాలం వేటు వేసింది కాకుండా, తమ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తావా..? అంటూ భారీ మూల్యం చెల్లించాలనడం వారి విజ్ఞతకు సముచితంగా అనిపిస్తుందా.? తన ప్రవర్తనకు సరితాదేవి తర్వాత క్షమాపణలు కోరినా కనుకరించని ఏఐబీఏ ఇలాంటి చర్యలను కొరియా క్రీడాకారులపైనా చెప్పట్టగలదా అని భారతీయులు ప్రశ్నిస్తున్నారు. మనోధైర్యంతో తనకు జరిగిన అవమానాన్ని ప్రశ్నించిన సరితాదేవికి అండగా నిలుస్తామంటున్నారు భారతీయులు.

మనోహర్, కార్తీక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : boxing  sarita devi  iaba  latest news  

Other Articles