Odisha chess player padmini raut won national women premier chess championship title

padmini raut, odisha chess player padmini raut, national women premier chess championship, bodda pratyusha, k lakshmi pranitha, hinduja reddy

odisha chess player padmini raut won national women premier chess championship title

ఊహించని మలుపులతో ఆట ముగించిన పద్మిని!

Posted: 11/05/2014 01:54 PM IST
Odisha chess player padmini raut won national women premier chess championship title

జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఒడిశా క్రీడాకారిణి పద్మిని రౌత్ ఊహించని మలుపులతో టైటిల్ ను తన సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన పదో రౌండ్ లో ద్మిని 94 ఎత్తుల్లో తెలంగాణా రాష్ట్రానికి చెందిన హిందూజారెడ్డిపై అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం పద్మిని 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో వుంది. దీంతో ఈమెకు మరో రౌండ్ మిగిలి వుండగానే టైటిల్ ఖాయమైంది. ఇతర క్రీడాకారిణులతో పోల్చుకుంటే పద్మినియే అందరికంటే ఎక్కువ పాయింట్లను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అందుకే.. ఇంకొక రౌండ్ మిగిలుండగానే ఈమె టైటిల్ ను సంపాదించుకుంది.

మరోవైపు నిషా మొహతా (పీఎస్‌పీబీ), మేరీ ఆన్ గోమ్స్ (బెంగాల్) ఏడేసి పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఫలితంగా బుధవారం జరిగే చివరిదైన 11వ రౌండ్ గేమ్ ఫలితాలతో ఎలాంటి సంబంధం లేకుండానే పద్మినికి టైటిల్ ఖరారైంది. ఇదిలావుండగా.. ఈ టోర్నీలోనే ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు అయిన బొడ్డ ప్రత్యూష, కె.లక్ష్మీ ప్రణీతలు పరాజయపాలయ్యారు. పదో రౌండ్ లో లక్ష్మీ ప్రణీత 54 ఎత్తుల్లో నిషా మెహతా చేతిలో... ప్రత్యూష 38 ఎత్తుల్లో వర్షిణి (తమిళనాడు) చేతిలో ఓడిపోయారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles