Dileep kumar swimmed for 24hours and got asia guinness book

guinness book, guinness book of world records, guinness book india records, guinness book of asia, telugu people in guinness book records, indians in guinness book, limca book of records, limca book of records names, limca book of records telugu people, limca book of records indians, latest world records updates, sports news, swimmers, swimming technics, latest updates

dileep kumar swimmed for 24hours and got asia guinness book : dileep kumar from karimnagar district gadawari khani swimmed for 24hours and entered into guinness book of world records asia continent

ఈతలో రికార్డు కొట్టిన తెలంగాణ దిలీప్

Posted: 10/20/2014 03:28 PM IST
Dileep kumar swimmed for 24hours and got asia guinness book

ఓ పది నిమిషాలు నిర్విరామంగా ఈతకొడితేనే అలసట వస్తుంది. అలాంటిది ఓ అబ్బాయి ఇరవై నాలుగు గంటల పాటు నిర్విరామంగా ఈతకొట్టాడు. అదీమన తెలుగుతేజమే కావటం విశేషం. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గోదావరి ఖనికి చెందిన దిలీప్ కుమార్ ఈతను బాగా ప్రాక్టిస్ చేసి రాటుదేలాడు. గంటల తరబడి నీటిలో ఉండటం సాధన చేశాడు. ఇతడి గురించి తెలుసుకున్న గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రతినిధులు దిలీప్ ను కలిశారు. హైదారాబాద్ శివారు ప్రాంతం అయిన యాప్రాల్ లోని ఓ స్విమ్మింగ్ పూల్ లో తన ప్రతిభను నిరూపించాడు.

శనివారం సాయంత్రం గం.5.45కు ఈత మొదలుపెట్టి.., ఆదివారం సాయంత్రం గం.5.50 వరకు నిరంతరాయంగా ఈదుతూనే ఉన్నాడు. ఈ ఫీట్ చూసిన గిన్నిస్ బుక్ రికార్స్డ్ ప్రతినిధులు ఆసియా విభాగంలో దిలీప్ పేరును చేర్చారు. రికార్డు నెలకొల్పేందుకు గంటకు యాబై మీటర్ల వేగంతో దాదాపు 75కిలోమీటర్లు ఈదాడు. తన తదుపరి లక్ష్యం ఇంగ్లీష్ ఛానల్ ఈదటమే అని దిలీప్ తెలిపాడు. ఇందుకోసం అహర్నిశలూ కృషి చేస్తానని చెప్తున్నాడు. దిలీప్ ప్రతిభ గురించి తెలిసినవారు యువకిశోరాన్ని అభినందిస్తున్నారు.

ప్రభుత్వం తనకు సహకారం అందిస్తే.., మరింత మెళుకువలు నేర్చుకుని ప్రపంచ స్థాయిలో తెలంగాణకు, దేశానికి మంచి పేరు తెస్తానని ధీమాగా చెప్తున్నాడు. దిలీప్ కు ప్రభుత్వం సహకారం అందించాలని గోదావరి ఖని నేతలు కోరుతున్నారు. తెలుగు విశేష్ కూడా ఈతగాడికి చేయూతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.

కార్తిక్ప్రతిని

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swimming  latest updates  gunniess records  sports news  

Other Articles