Telugu girl jyothi surekha won national senior archery championship

jyothi surekha, jyothi surekha national senior archery championship, jyothi surekha archery game, jyothi surekha archery games, jyothi surekha medals, indian sports persons, jyothi surekha national champion ship, jyothi surekha latest news, jyothi surekha news, national archery champion ship

telugu girl jyothi surekha won national senior archery championship with a record score

జాతీయ ఛాంప్ గా నిలిచిన తెలుగమ్మాయి!

Posted: 10/17/2014 03:03 PM IST
Telugu girl jyothi surekha won national senior archery championship

గతకొద్దికాలం నుంచి మహిళలు కూడా పురుషులకంటే ఏమీ తీసిపోని విధంగా తమ సత్తా చాటుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో పురుషులకంటే మహిళలే జోరే ఎక్కవగా వుందన్న విషయం అందరికీ తెలిసిందే! అందులో ముఖ్యంగా తెలుగమ్మాయిలు కూడా జట్టు విజయంలో కీలకపాత్రను పోషించారు. బహుశా వారినుంచి ఇతర క్రీడాకారులు స్ఫూర్తి పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న క్రీడల్లో భాగంగా కొంతమంది మహిళలు తమ ప్రతిభతో సరికొత్త రికార్డులతో విజయాలను సాధిస్తున్నారు. అందులో ఒకరు తెలుగమ్మాయి వెన్నం జ్యోతిసురేఖ!

జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతిసురేఖ చాంపియన్ గా నిలిచింది. గురువారం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఫైనల్లో జ్యోతి 141-132తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పూర్వాషా షిండేపై విజయం సాధించింది. సెమీస్ లో 142-134తో జార్ఖండ్ కు చెందిన జానుపై, క్వార్టర్స్ లో 137-134తో హర్యానాకు చెందిన సుప్రియపై అద్భుతమైన ప్రతిభతో విజయం సాధించింది. గత నాలుగు సంవత్సరాలలో మూడుసార్లు బరిలోకి దిగిన జ్యోతి... రెండుసార్లు విజేతగా నిలవడం విశేషం. అయితే నిరుడు జాతీయ చాంపియన్ షిప్ లో మాత్రం ఈమె పాల్గొనలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles