Deepika pallikal won jsw squash challenger circuit title

deepika pallikal news, deepika pallikal latest news, deepika pallikal jsw suqash title, deepika pallikal won the game, jsw squash challenger title, deepika pallikal dinesh karthik, harindar paul singh

deepika pallikal won jsw squash challenger circuit title

ఆటలో ప్రత్యర్థిని ‘‘స్క్వాష్’’ చేసేసిన దీపిక!

Posted: 10/20/2014 05:37 PM IST
Deepika pallikal won jsw squash challenger circuit title

భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ తో వివాహం చేసుకోబోతున్న దీపిక పల్లికల్.. తాజాగా ఒక అరుదైన ఘనతను సాధించింది. ఆటలో తన ప్రతిభతో చాలా బాగా ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని ‘‘స్వ్కాష్’’ చేసేసింది ఈ అమ్మడు. జేఎస్ డబ్ల్యూ స్క్వాష్ ఛాలెంజర్ పోటీల్లో పాల్గొన్న ఈ భారత స్టార్.. అద్భుతంగా ప్రదర్శించి ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. మొదటినుంచి దూసుకుపోయిన ఈ అమ్మడు క్వార్టర్, సెమీ, ఫైనల్లోనూ అదే దూకుడుతో విజయం సాధించింది.

ఫైనల్లో చేరుకున్న దీపికకు, ఈజిప్ట్ కు చెందిన ఎల్ టొర్కికు మధ్య రసవత్తరంగానే మ్యాచ్ కొనసాగింది. ఇద్దరిలో ఎవరూ విజయం సాధిస్తారనే టెన్షన్ ఇద్దరి యాజామాన్యాలు తీవ్ర టెన్షన్ లో మునిగిపోయింది. అయితే చివరగా పల్లికల్ విజేతగా నిలిచింది. 14-12, 12-10, 11-7 స్కోరుతో తన ప్రత్యర్థి టొర్కిని ఓడించి, స్వ్కాష్ ఛాలెంజర్ సర్క్యూట్ టైటిల్ ను గెలుచుకోగలిగింది.

మరోవైపు పురుషుల విభాగంలోనూ హరిందర్ పాల్ సింగ్ కూడా చెలరేగిపోయాడు. ఫైనల్లో ఎసామ్ హోస్నితో తలబడిన హరిందర్ ల మధ్య కొద్దిసేపటివరకు మ్యాచ్ ఉత్కంఠభరితంగానే సాగింది. అయితే హరిందర్ తన అద్భుత ప్రదర్శనతో 11-9, 11-7, 11-7 స్కోరుతో హోస్నిని ఓడించి, టైటిల్ గెలుచుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles