Badminton denmark open tourney become a challenge to sania nehwal and pv sindhu

saina nehwal, pv sindhu, indian badminton stars, denmark open tourney, badminton matches, saina nehwal pv sindhu news, parupalli kashyap, commonwealth games, asian games, badminton games, indian sports persons

badminton denmark open tourney become a challenge to sania nehwal and pv sindhu

పోరాటానికి సిద్ధమైన సైనా-సింధు...

Posted: 10/15/2014 01:11 PM IST
Badminton denmark open tourney become a challenge to sania nehwal and pv sindhu

ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో నిరాశపరిచిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, పివి సింధులు... సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ డెన్మార్క్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈసారి జరగబోయే ఈ టోర్నీలో ఎలాగైనా పతకాలు గెల్చుకోవాలనే ఆశతో వీరిద్దరూ కఠోర ప్రాక్టీస్ చేశారు కూడా! తన దీర్ఘకాల కోచ్ అయిన గోపీచంద్ కు వీడ్కోలు పలికి, విమల్ కుమార్ అనే కోచ్ వద్ద బెంగుళూరులో శిక్షణ పొందుతున్న సైనాకు ఈ టోర్నీ పెద్ద పరీక్షగా మారిపోయింది. అలాగే ఎంత అద్భుతమైన నైపుణ్యం వున్నప్పటికీ.. నిలకడలేమితో ఇబ్బంది పడుతున్న సింధుకు కూడా ఈ టోర్నీ కీలకంగా మారింది. ఈ టోర్నీలో గెలిస్తేగానీ గతంలో జరిగిన నష్టాన్ని వీరిద్దరూ పూరించుకోగలరు.

రెండేళ్ల ఛాంపియన్ షిప్ లో వరుసగా కాంస్య పతకాలు నెగ్గి చరిత్ర సృష్టించిన సింధు... గతేడాదిలో జరిగిన ఈ టోర్నీలో తొలి రౌండ్ లోనే వెనుదిరిగి భారతీయ అభిమానుల్ని నిరాశపరిచింది. ఇక 2012లో డెన్మార్క్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సైనా.. ఈ ఏడాదిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో, ఇండియా గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో విజేతగా నిలిచి... మిగితా టోర్నీలలో వెనుదిరిగి వచ్చేసింది. దీంతో వీరిద్దరికీ ఈ డెన్మార్క్ టోర్నీ ఎంతో కీలకంగా మారిపోయింది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్ లో సైనా నెహ్వాల్ జర్మనీకి చెందిన కరీన్ షానాస్ తో, హాంకాంగ్ కు చెందిన పుయ్ యిన్ యిప్ తో సింధు తలపడనున్నారు. ఇక పురుషుల విభాగానికి వస్తే... కామన్వెల్త్ స్వర్ణ పతక విజేతగా నిలిచిన పారుపల్లి కశ్యప్ ఇంగ్లాండ్ కు చెందిన రాజీవ్ ఉసెఫ్ తో, చైనాకు చెందిన జుయ్ సాంగ్ తో శ్రీకాంత్ పోటీపడతారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saina nehwal  pv sindhu  parupalli kashyap  denmark open tourney  

Other Articles