Indian super league updates

isl, indian super league, indian super league matches, indian super league schedule, indian super league timetable, indian super league latest updates, sports news, isl wii, isl latest updates, isl matches schedule, latest updates, sports updates, kolkatha isl team

kolkatha team won its first match in isl on sunday on mumbai team : isl given its first victory to kolkatha team by defeating mumbai city fc team

ఐఎస్ఎల్ లో కోల్ కతా బోణీ

Posted: 10/13/2014 02:53 PM IST
Indian super league updates

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) లో కోల్ కతా జట్టు బోణి కొట్టింది. ముంబై సిటీ ఎఫ్.సీ, అట్లెటికో డి కోల్ కతా జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో 3-0తేడాతో ముంబై జట్టును కోల్ కతా మట్టికరిపించింది. వివేకానంద యువభారతి క్రిరంగన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. స్పెయిన్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఆటగాళ్ళు ప్రత్యర్ధిని చిత్తు చేశారు. కోల్ కతా ప్రజలు ఫుట్ బాల్ ను ఎక్కువగా ఇష్టపడతారు. దీంతో అభిమానుల ఆసక్తికి తగ్గట్లుగా స్టేడియంకు వచ్చే వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకుని తొలిసారి 17 భారీ తెరలను ఏర్పాటు చేశారు.

మ్యాచ్ ప్రారంభం నుంచే కోల్ కతా ఆధిక్యం కనబర్చింది. దీంతో రణ్ బీర్ కపూర్ జట్టు ఓటమి దిశగా అడుగులు వేయటం మొదలు పెట్టింది. కీలకమైన సమయంలో స్ర్టయికర్ ఫిక్రూ టెఫెరా తొలి విజయం అందించాడు. ఆ తర్వాత బోర్జా రెండవ గోల్ చేశాడు. ఇక అదనపు సమయంలో ఫిక్రూ పాస్ ను లిబర్డ్ గోల్ చేయటంతో కోల్ కతా మూడు పాయింట్లు సాధించింది. అయితే ముంబై ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. తొలి గోల్ సమయంలో ముంబై తరపు గోల్ కీపర్ సుబ్రతా పాల్ పోస్టును దాటుకుని మరీ ముందుకు వచ్చినా లాభం లేకపోయింది. బోణి కొట్టిన సంబరంతో కోల్ కతా జట్టు సభ్యులు గ్రౌండ్ లో కలియతిరిగారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian super league  latest updates  sports news  kolkatha team  

Other Articles