Harika draw poker masters chess tourney second games with jonathan bakalchuk

harika, chess player harika, poker masters chess tourney, abhijit gupta, chess grand master abhijit gupta, jonathan bakalchuk, harika jonathan, chess game, indian chess game players

harika draw poker masters chess tourney second games with jonathan bakalchuk

తొందరపడి.. తప్పుటడుగులు వేసేసిన హారిక!

Posted: 10/07/2014 05:35 PM IST
Harika draw poker masters chess tourney second games with jonathan bakalchuk

చెస్ గేమ్ లో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న హారిక.. ఒక సందర్భంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, తప్పటడుగులు వేసినట్లు కనిపిస్తోంది. పోకర్ మాస్టర్స్ చెస్ టోర్నీలోని రెండో గేమ్ ను అద్భుతంగా మొదలుపెట్టి ప్రత్యర్థితోపాటు అందరినీ ఆశ్చర్యపరిచిన హారిక.. ఆ తరువాత తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేతినుంచి మ్యాచ్ ను చేజార్చుకుంది. ఎవ్వరు ఊహించని విధంగా మొదట్లో మలుపుతిప్పిన హారిక.. ఆ తరువాత తానే చిక్కుముడుల్లో పడిపోయినట్లు కనిపించింది.

జొనాథన్ బకెల్ చుక్ (ఇజ్రాయిల్)తో కలిసి పోకర్ మాస్టర్స్ చెస్ టోర్నీలోని రెండో గేమ్ ను ఆడిన హారిక.. ఆ ఆటను డ్రాగా ముగించేసింది. ఆరంభంలో అద్భుతమైన ఎత్తులతో ప్రత్యర్థిని ముచ్చెమటలు పట్టించన హారిక.. మిడిల్ గేమ్ లో మాత్రం తన జోరును తగ్గించేసింది. దీంతో బకెల్ చుక్ ఎదురుదాడి ప్రారంభించింది. ఒకానొక దశలో హారిక ఓడిపోయే సందర్భాలు వచ్చినప్పటికీ.. తన ప్రతిభతో రక్షణాత్మక ధోరణిలో ఆడి గేమ్ డ్రా చేసుకుంది. దీంతో హారిక 1.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే గ్రాండ్ మాస్టార్ అభిజిత్ గుప్తా రెండు గేముల్లో వరుసగా విజయాలు నమోదు చేసి 2 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chess harika  grand master abhijit gupta  poster masters chess tourney  

Other Articles