Indian men hockey team won gold medal in asian games against pakistan after 16 years

indian hockey team, hockey team won gold medal, gold medals asian games, india won gold medals, india hockey team

indian men hockey team won gold medal in asian games against pakistan after 16 years

పాకిస్తాన్ ను ఓడించి చరిత్రను తిరగరాసిన భారత హాకీ జట్టు

Posted: 10/04/2014 05:36 PM IST
Indian men hockey team won gold medal in asian games against pakistan after 16 years

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు చాలాకాలం తర్వాత తన సత్తా చాటుకుంది. తన భారతదేశానికి తీరని సంతోషాన్ని అందించింది. చాలా ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ మ్యాచ్ లో భారత్ పెనాల్టీ షూటౌట్ లో పాకిస్తాన్ ను మట్టికరిపించింది. నిర్ణీత 60 నిముషాల్లో రెండు జట్లు 1-1 స్కోరుతో సమం చేయడం వల్ల పోరు పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది. ఈ పెనాల్టీలో భారత్ గెలుస్తుందా..? లేదా..? అంటూ టెన్షన్ తో మునిగిపోయిన సందర్భంలో.. ఇండియన్ గోల్ కీపర్ తన అద్భుత ప్రదర్శనను కనబరిచి భారత్ ను గెలిపించాడు. దెబ్బకు రెండుపిట్టలు అన్నట్లు ఈ మ్యాచ్ గెలవడంతో భారత్ పసిడితోపాటు 2016 ఒలంపిక్స్ కు హాకీ జట్టు ఎంపికైంది.

మొదట్లో ఎంతో హోరాహోరీగా ప్రారంభం అయిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఇండియన్స్ ను బాగానే కంగారు పెట్టించేశారు. మూడో నిముషంలోనే రిజ్వాన్ అనే ఆటగాడు గోల్ చేసి పాక్ ను ఆధిక్యంలో వుంచాడు. దీంతో ఖంగుతిన్న భారత్ కూడా గోల్ కోసం ఎన్నో అవస్థలు పడింది. రెండు, మూడుసార్లు గోల్ చేసే అవకాశం వచ్చినా చేయలేకపోయింది కానీ.. 27వ నిముషంలో ఫలితాన్ని రాబట్టింది. గుర్బాజ్ క్రాస్ ను నెట్లోకి పంపి కొతాజిత్ స్కోరు సమం చేశాడు. ఈ విధంగా స్కోరు సమం అయిన నేపథ్యంలో మరో గోల్ కోసం రెండు జట్లు బాగానే పోరాడాయి కానీ.. ఎవ్వరు సాధించలేకపోయారు. దీంతో ఫైనల్ గా పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది.

ఈ పెనాల్టీ షూటౌట్ లో భారత గోల్ కీపర్ శ్రీజేష్ గొప్ప ప్రదర్శన చేశాడు. హసీమ్ ఖాన్, మహ్మద్ ఉమర్ బుట్టా వంటివారి గోల్ వేసే ప్రయత్నాలను అడ్డుకుని భారత్ ను విజయపథంలో నడిపించాడు. ఇక భారత్ తరఫున గోల్ వేసేందుకు వెళ్లిన ఆకాష్ దీప్, రూపిందర్, బీరేంద్ర లక్రా, ధరమ్ వీర్ సింగ్ విజయవంతం కాగా.. మన్ ప్రీత్ ఒక్కడే విఫలమయ్యాడు. ఏదైతేనేం.. మ్యాచ్ చివరకు ఇండియా చేతికే దక్కింది. దీంతో 16 ఏళ్ల తరువాత హాకీలో భారత్ పసిడి పతకం సాధించింది. ఇదిలావుండగా.. మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో రెండుజట్ల ఆటగాళ్లు పలుమార్లు వాగ్యుద్ధానికి దిగడం చర్చనీయాంశం అయింది. అయితే తర్వాత సద్దుమణిగింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian hockey team  asian games  indian sports persons  

Other Articles