Indian discus throw player seema punia feeling hurt with sports officials behaviour

seema punia, discus throw seema punia, seema punia latest news, seema punia press meet, indian sports officials, discus throw game, indian sports persons, seema punia interview

indian discus throw player seema punia feeling hurt with sports officials behaviour

ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించినా.. వేధింపులు తప్పలేదు!

Posted: 10/08/2014 01:02 PM IST
Indian discus throw player seema punia feeling hurt with sports officials behaviour

భారత మహిళలు ఎంత ఎత్తుకి ఎదిగినా.. వారికి వేధింపులు మాత్రం తప్పలేదు. సాధారణ మహిళల విషయాలను పక్కనపెడితే... నిన్న జరిగిన ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచి, ఇండియా గౌరవాన్ని నిలబెట్టిన సీమా పూనియాకు సైతం అధికారుల నుంచి వేధింపులు తప్పలేదు. ఈమె మీద ఈ వేధింపులు ఇప్పటినుంచే కాదు.. ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తూనే వున్నానని ఆమె స్వయంగా ప్రకటించింది. గత 14 ఏళ్లుగా సీమా మెరుగైన ప్రదర్శన చేస్తున్నా... అధికారులు తనపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని తెలిపింది.

భారతీయ క్రీడాకారిణి అయిన సీమాపూనియా తనవంతు మంచి ప్రదర్శనను కనబరిచి, ఎన్నో పతకాలు సాధించి దేశగౌరవాన్ని నిలపెట్టడంలో కీలకపాత్రను పోషించింది. అయినా తన ప్రదర్శనకు తగ్గట్టు అధికారులు ఆమెను గౌరవించడం లేదని ఆవేదనను వెళ్లగక్కింది. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను జూనియర్ ఛాంపియన్ షిప్ లో పతక విజేతను. వరుసగా మూడు కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు గెలిచా.. ఇప్పుడు ఇంచియాన్ ఆసియా క్రీడల్లోనూ స్వర్ణం సాధించాను. దశాబ్దానికిపైగా వున్న నా సుదీర్ఘ కెరీర్ లో దేశానికి ఎంతో కీర్తిని తీసుకొచ్చాను. అటువంటి సమయంలో నాపట్ల మరింత హుందాగా వుండాల్సిందిపోయి.. అధికారులు నేనేం సాధించినా అనుమానంగానే చూశారు. ఇదెక్కడి న్యాయం’’ అంటూ వివరించింది.

అధికారులు సీమాను చిన్నచూపు చూడటానికి ఒక ప్రముఖ కారణం కూడా వుంది. 2000 ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్ లో సీమా స్వర్ణపతకం సాధించి, భారత్ గౌరవాన్ని నిలబెట్టింది కానీ.. డోప్ పరీక్షల్లో దొరికిపోవడంతో ఆ పతకాన్ని వెనక్కి తీసేసుకున్నారు. దీంతో అప్పటినుంచి అధికారులు ఈమెను అంతగా పట్టించుకోవడం లేదు. పైగా అలాగే ఇతర ఆటల్లో కూడా డోప్ పరీక్షల్లో ఎక్కడ దొరికిపోతుందేమోనన్న భయంతో వున్నట్లు సదరు అధికారులు వాపోతున్నారు. అయినా.. ఎప్పుడో జరిగిన సంఘటనకు ఇప్పటివరకు సీమాను దోషిగానే చూడటం సరికాదని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : seema punia  asian games  indian sports officials  celebrities interviews  

Other Articles