Samantha taylor controversial comments on south african athlete blade runner oscar pistorius

samantha taylor, oscar pistorius, reeva steenkamp, samantha taylor oscar pistorius, reeva steenkamp oscar pistorius, reeva steenkamp hot photo shoot, samantha taylor hot photos

samantha taylor controversial comments on sourh african athlete blade runner oscar pistorius who killed his girlfriend

పిస్టోరియస్ నన్ను చంపేస్తాడనుకున్నా! సమంత

Posted: 09/15/2014 12:45 PM IST
Samantha taylor controversial comments on south african athlete blade runner oscar pistorius

దక్షిణాఫ్రికా అథ్లెట్ బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ గతేడాది తన ప్రేయసి రీవా స్టీన్ కాంప్ ను తన ఇంట్లోనే తుపాకీతో కాల్చి విషయం అందరికీ తెలిసిందే! అయితే తాను మాత్రం తన ప్రేయసిని ఉద్దేశపూర్వకంగా చంపలేదని.. ఎవరో దొంగ ఇంట్లో చొరబడ్డాడని భావించి పొరబాటున కాల్చేశానని మొదటినుంచి మొత్తుకుంటూనే వస్తున్నాడు. అందుకు సంబంధించి కేసు ఇంకా కోర్టు విచారణలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అతడు పొరబాటున తన ప్రేయసి చంపి వుంటాడని.. ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపాడనడానికి సరియైన ఆధారాలు లేవని కోర్టు తీర్పునిచ్చేసింది కూడా! అయితే ఇంతలోనే పిస్టోరియస్ మాజీ ప్రేయసి సమంత టేలర్.. అతనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అతడు హంతకుడు అనుకునే రీతిలో ఆమె స్టేట్ మెంట్ ఇచ్చేసింది.

‘‘ఆస్కార్ పిస్టోరియస్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని.. తనను కూడా చంపేస్తాడని తాను అనుకున్నానని’’ అతని మాజీ ప్రేయసి సమంత టేలర్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే మాట్లాడుతూ.. ‘‘రీవాకంటే ముందుగా నేనే బలవ్వాల్సి వుండేది. పిస్టోరిస్ తన ప్రేయసి రీవాను చంపినప్పుడు నేనే చనిపోయానేమోనని భావించి నా స్నేహితులు, బంధువులు మృతికి సంతాపం తెలియజేస్తూ సందేశాలు కూడా పంపారు. అయితే తర్వాత నేను చావలేదని వారు తెలుసుకున్నారు. పిస్టోరియస్ తో వున్నంతకాలం నేను చాలా భయపడ్డాను. నా జీవితంలో ఇంకెవరైనా వుండేవారేమోనని నన్ను అనుమానిస్తూ తరుచూ నా మొబైల్ చూస్తుండేవాడు. దాంతో నాకు చిరాకు వచ్చి అతని నుంచి దూరమవ్వాల్సి వచ్చింది. అతడికి తుపాలకీలంటే ఎంతో పిచ్చి. నిత్యం అతని దగ్గర తుపాకీలుండేవి’’ అని సమంత పేర్కొంది. దీంతో పిస్టోరియస్ పై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha taylor  oscar pistorius  reeva steenkamp  south african athlete  

Other Articles