Biography of poor girl navatha who selected in asian games 2014

telangana girl navatha, navatha biography, asian games 2014, telangana girl navatha in asian games 2014, poor girl navatha, navatha news, sepak takraw games, asian sepak takraw games 2014, navatha sepak takraw game, navatha asian games 2014

biography of poor girl navatha who selected in asian games 2014

క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెటూరి అమ్మాయి!

Posted: 09/15/2014 12:04 PM IST
Biography of poor girl navatha who selected in asian games 2014

‘‘కృషి వుంటే మనుషులు ఋషులవుతారు’’ అన్న పదాన్ని ఇప్పటివరకు విన్నాం... ఇప్పుడీ వాక్యాన్ని ఒక పేద అమ్మాయి చేసి నిరూపించింది. తనని పేదరికం ఎన్ని ఇబ్బందులు పెట్టించినా... వాటిని ఎదుర్కొన్ని ఈరోజు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఒకవైపు పల్లెటూరి నేపథ్యం... మరోవైపు పేద కుటుంబం... అయినప్పటికీ ఈ రెండింటినీ ఎదుర్కొని ఒక పాలమూరు అమ్మాయి నవత అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇతర పేదరిక అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచింది. పట్టుదల వుంటే ఆశయాలను నెరవేర్చుకోవచ్చనే సూక్తిని అందరికి నేర్పించింది. సెకప్ తక్రా లాంటి భిన్నమైన క్రీడను ఎంచుకుని.. అందులో అద్భుతంగా రాణించి.. నేడు ఆసియా క్రీడల్లో అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆ తెలంగాణ నవత.. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.

మహబూబ్ నగర్ జిల్లా ఖిల్లాఘనపురం మండలానికి చెందిన పెద్దగోపాల్, శేషమణి దంపతుల ఐదుగురు కుమార్తెల్లో నవత మూడో అమ్మాయి. ఈమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అలాగే కూరగాయలు సాగుచేసి కుటుంబాన్ని పోషిస్తూ తమ ఐదుగురు అమ్మాయిలను చదివిస్తున్నారు. అంత పెద్ద కుటుంబంలో అందరి కడుపు నింపడమే ఆ తల్లింద్రులకు ఎంతో కష్టం. అయినప్పటికీ.. తమ కూతుళ్లను చదివించడానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఇక తమ కుమార్తె నవతకు క్రీడల మీద వున్న ఆశయాన్ని వారు గ్రహించగలిగారు. తమ కుమార్తెకు క్రీడల మీద వున్న ఆసక్తిని గమనించి.. తన ఆశయాన్ని నెరవేర్చేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆమెను ప్రోత్సహించారు. తనకు అండగా నిలుస్తూ.. తన ఆసక్తిని నీరుగార్చకుండా.. ఎటువంటి లోపాలు లేకుండా సహాయం అందించారు. దాంతో నవత వెనక్కి తిరిగి చూడలేదు. తన ఆశయంతోపాటు తల్లిదండ్రుల కోరికను కూడా నెరవేర్చింది.

మొదట హకీంపేట తెలంగాణ క్రీడా పాఠశాలలో నాలుగో తరగితిలో ప్రవేశాలకోసం 2006లో చేపట్టిన సెలక్షన్స్ లో నవత పాల్గొని.. అందులో తన సత్తా చాటింది. దాంతో ఆ పాఠశాలలో శిక్షణకు ఎంపికైంది. అక్కడ కోచ్ ఇచ్చిన సూచన మేరకు సెపక్ తక్రా ఆటను కెరీర్ గా ఎంచుకుంది. అప్పటినుంచి ఆ ఆట మీదే ఆసక్తిని పెంచుకుంటూ దూసుకుపోతూ వచ్చింది. దీంతో 2009లో రాజస్థాన్ లో జరిగిన సెపక్ తక్రా నేషనల్స్ లో పాల్గొంది. అక్కడ జట్టు రజతం గెల్చుకోవడంలో కీలకపాత్రను పోషించింది. అలాగే ఎన్నో జాతీయ పతకాలను సొంతం చేసుకుంది. గతేడాది థాయ్ లాండ్ లో జరిగిన కింగ్స్ కప్ సెపక్ తక్రా ప్రపంచకప్ లో భారత్ జట్టు మూడో స్థానం సాధించడంతో నవత కీలక సభ్యురాలు. ఇక, ఇటీవల హైదరాబాద్ లో ఆసియా క్రీడల కోసం నిర్వహించిన సెలక్షన్స్ లో 12 మంది సభ్యులున్న భారత జట్టుకు ఎంపికైంది.

ఒలంపిక్స్ తర్వాత ప్రపంచంలో అతిపెద్ద క్రీడా సంబరమైన ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత సెపక్ తక్రా జట్టులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఎకైక క్రీడాకారిణి నవత. ఎన్నో కష్టాలను అనుభవిస్తూనే తన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిందని నవత తెలుపుతోంది. ఆసియా క్రీడల్లో సత్తా చాటి తనను ఇంత స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తాననే పట్టుదలను ప్రదర్శిస్తోంది. తమ జట్టు ఖచ్చితంగా స్వర్ణ పథకాన్ని సాధిస్తుందని.. దానికి లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నామని నమ్మకంతో పేర్కొంటున్న నవత... తమ లక్ష్యాన్ని సాధించి తెలుగుజాతి గౌరవాన్ని పెంపొందించాలని కోరుతోంది ‘‘తెలుగువిశేష్’’!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sepak takraw game  asian games  telangana poor girl navatha  navatha asian games  

Other Articles