Suspend ipl pending clean up former bcci chief

Shashank Manohar, BCCI, N. Srinivasan, Supreme Court, IPL spot-fixing scandal, Justice Mudgal committee

Suspend IPL pending clean-up-former BCCI chief

2014 ఐపీఎల్‌ను నిలిపివేయండి!

Posted: 03/27/2014 03:39 PM IST
Suspend ipl pending clean up former bcci chief

 సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. స్పాట్, మ్యాచ్ ఫిక్సింగ్‌లతో ప్రజలకు ఆటపై విశ్వాసం పోయింది. ఈ నేపథ్యంలో 2014 ఐపీఎల్‌ను రద్దు చేయాలి. క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించడమే తమ ప్రధాన బాధ్యత తప్ప డబ్బు, లాభాలు కాదని బీసీసీఐ సభ్యులు ఈ చర్యతో నిరూపించవచ్చు అని   బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ వ్యాఖ్యానించారు.

ఫిక్సింగ్ వ్యవహారాలపై సీబీఐతో పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చే వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను రద్దు చేయాలని మనోహర్ డిమాండ్ చేశారు. క్రికెట్‌పై ప్రజల్లో నమ్మకం పెంచే వరకు ఈ టోర్నీని జరపకపోవడమే మంచిదని ఆయన సూచించారు.

ఫిక్సింగ్ వివాదం వెలుగులోకి రాగానే ఐపీఎల్ అన్ని మ్యాచ్‌లపై విచారణ జరపాలని తాను గతంలోనే కోరినట్లు ఆయన అన్నారు. యూఏఈలో మ్యాచ్‌లు నిర్వహిస్తే ఐపీఎల్‌కు ఇంకా చెడ్డ పేరు వస్తుందని శశాంక్ అభిప్రాయపడ్డారు.

 మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్‌ల కారణంగా మధ్య ప్రాచ్యంలో మ్యాచ్‌లు నిర్వహించవద్దని బీసీసీఐ గతంలోనే నిర్ణయం తీసుకుంది. నాకు తెలిసి ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పూ జరగలేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ జరుపుతున్నారు. ఇప్పటికే లీగ్‌కు ఉన్న చెడ్డ పేరు సరిపోదా అని బోర్డు మాజీ అధ్యక్షుడు ప్రశ్నించారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles