Shakira records second official fifa world cup song

Shakira, FIFA World Cup, FIFA World Cup song, Singer Shakira Images, Singer Shakira Photos, Shakira records

Shakira records second official FIFA World Cup song

కుర్రకారు చేత కేకలు పెట్టిస్తున్న అమ్మడు..!

Posted: 03/26/2014 11:09 AM IST
Shakira records second official fifa world cup song

కొలంబియా పాప్‌స్టార్‌ షకీరా మరోసారి కుర్రకారును తన ఆటపాటలతో, అందచందాలతో గమ్మత్తు చేయనుంది. తన ఒంపుసొంపులతో వయ్యారాలు ఒలకబోస్తు కుర్రకారును తన మత్తుతో గమ్మత్తు చేయడానికి రంగం సిద్ధమైంది. 2014 ప్రపంచ్‌కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఆమె పాడుతూ నర్తించనుంది.

2010 ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభోత్సవంలో ఆమె సూపర్‌హిట్‌ పాట ‘వాకా వాకా’ ఫుట్‌బాల్‌ అభిమానులనే కాక యావత్‌ ప్రపంచ పాప్‌ సంగీత అభిమానుల్ని విశేషంగా ఆకర్షించిన విషయం విదితమే. అప్పుడు ఆ పాటకు యువత ఉర్రూతలూగుతూ నృత్యాలు చేశారు. నాటి పాప్‌ సంగీత రంగంలో ఆ పాట ఓ పెనుసంచలనమైంది. ప్రస్తుతం టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా పాట ఆలపించేందుకు స్వయంగా షకీరానే పాట రాశారు.

బ్రెజీలియన్‌ ఆప్‌బీట్‌తో సాగే ‘లా…లా…లా…’ పాప్‌ అభిమానులతో పాటు ఫుట్‌బాల్‌ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటుందని షకీరా అంటోంది. యువతకు మరోసారి షకీరా తన అందం, గాత్రం, నృత్యంతో పసందైన విందు చేయనుంది.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh