భారత క్రికెటర్లు ప్రపంచ ఛాంపియన్స్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇక మహిళల జట్టు కూడా అదే స్థాయి ఆటగాళ్లన్న విషయాన్ని లో ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ మహిళల బిగ్ బాష్ లీగ్-2022లో తొలి సారి ఆడనుంది. ఈ మెరకు బ్రిస్బేన్ హీట్‌తో పూజా తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బ్రిస్బేన్ హీట్ వెల్లడించింది. కాగా న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ తర్వాత బ్రిస్బేన్ హీట్‌కు పూజా రెండో విదేశీ క్రికెటర్ కావడం గమనార్హం.
గత ఏడాది ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టు తరపున వస్త్రాకర్ అద్భుతంగా రాణించింది. అదే విధంగా ఈ ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లోనూ పూజా తన ప్రదర్శనతో అకట్టుకుంది. వరల్డ్‌కప్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన పూజా.. 156 పరుగులతో పాటు 10 వికెట్లు పడగొట్టింది. ఇక కామన్వెల్త్ గేమ్స్-2022కు ప్రకటించిన భారత జట్టులో పూజా భాగంగా ఉంది. అయితే ఆమె కరోనా బరిన పడడంతో ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి మ్యాచ్‌కు దూరం కానుంది.
ఇప్పటికే భారత స్టార్ మహిళా క్రికెటర్లు బిగ్ బాష్ లీగ్‌లో భాగమయ్యారు. వారిలో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్), షఫాలీ వర్మ, రాధా యాదవ్ (సిడ్నీ సిక్సర్స్) తరపున ఆడగా.. రిచా ఘోష్ (హోబర్ట్ హరికేన్స్) హర్మన్‌ప్రీత్ కౌర్ ( మెల్ బోర్న్ రెనెగేడ్స్ ), రాధా యాదవ్ ( సిడ్నీ సిక్సర్స్) తరపున ప్రాతనిధ్యం వహిస్తున్నారు. ఇక వీరి సరసన పూజా వస్త్రాకర్ కూడా చేరిపోయింది. దీంతో ఎనమిది మంది భారత మహిళా క్రికెటర్లకు బిగ్ బాష్ లీగ్ లో స్థానం లభించింది.
(And get your daily news straight to your inbox)
Jul 29 | భారత్‌తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌ను 3-0తో కోల్పోయిన వెస్టిండీస్ జట్టు సారథి నికోలస్ పూరన్ టీ20 సిరీస్ ముందు టీమిండియాకు హెచ్చరికలు పంపాడు. వన్డేలలో తమను ఓడించినా టీ20లలో తమది బలమైన జట్టు... Read more
Jul 28 | బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 41 పరుగుల తేడాతో ఓటమి చెందింది. అయితే ప్రోటిస్ పరాజయం పాలైన ప్పటికీ ఆ జట్టు యువ ఆల్ రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం... Read more
Jul 28 | వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. అతిధ్యజట్టు వెస్టిండీస్ పై వారి సొంతగడ్డపైనే ఓడించి.. మూడు వన్డేలను క్లీన్ స్వీప్ చేసింది. అయితే మూడవ వన్డేలో హైదరాబాదుకు చెందిన టీమిండియా... Read more
Jul 18 | ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడి సిరీస్ ను 2-3 తో కోల్పోయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం టీమిండియా తన సత్తాను చాటింది. ఓవైపు టీ20 సిరీస్ తో పాటు... Read more
Jul 18 | ఇంగ్లండ్ తో చివరి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. మాన్ చెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అతిధ్యజట్టుపై టీమిండియా స్పష్టమైన అధిపత్యాన్ని కనబర్చింది. ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో... Read more