న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచ్చెల్ తాను మైదానంలో ప్రత్యర్థి జట్టుతో క్రికెట్ అడుతుండగా.. అదే మైదానం నుంచి క్రికెట్ వీక్షిస్తున్న అభిమాని బీర్ తాగుతుండటంతో ఆయన చీర్స్ చెప్పాడు. అదేంటి మైదనంలో క్రికెట్ అడుతున్న వ్యక్తి ఆ అభిమానికి ఎలా చీర్స్ చెప్పాడంటారా.? అయితే చేయితో.. లేదా సైగలతో కాదు.. ఏకంగా తనదైన స్టైల్లో ఫ్యాన్ కు చీర్స్ చెప్పి నిరుత్సాహపర్చాడు. అదేంటి క్రికెటర్ చీర్స్ చెబితే నిరుత్సాహపడటం ఏంటంటారా.? అక్కడికే వస్తున్నాం. అయితే అల్ రౌండర్ మిచ్చెల్ తనదైన స్టైల్లో ప్రత్యర్థి ఇంగ్లాండ్ బౌలర్ వేసిన బంతిని బౌండరీకి తరలించాడు. ఇక ఆ వెంటనే మరో బంతిని సిక్స్ గా మలిచాడు.
సరే కానీ చీర్స్ ఎలా చెప్పాడంటారా.? తాను సిక్స్ కోట్టిన బంతి నేరుగా అభిమాని బీర్ గ్లాసులోకి వెళ్లి పడింది. ఇంకేముంది బీర్ చిల్లింది.. గ్లాసు పగిలింది. ఇలా క్రికెటర్ చీర్స్ చెప్పి అభిమాని బీరు నేలపాలు చేశాడు. దీంతో అభిమాని కూడా నిరుత్సాహపడ్డాడు. అయితే ఆ తరువాత కోలుకుని ఈ సిక్స్ తో తనకు వచ్చిన గుర్తింపు అసాధారణమని గుర్తించాడు. ఇంగ్లండ్‌తో రెండవ టెస్టులో ఈ ఘటన జరిగింది. టాప్ ఫామ్‌లో ఉన్న మిచ్చెల్.. 56వ ఓవర్లో భారీ షాట్ కొట్టాడు. జాక్ లీచ్ బౌలింగ్‌లో ముందకు వచ్చి మరీ సిక్సర్ బాదాడు. అయితే ఆశ్చర్యకరరీతిలో ఆ బంతి లాంగ్ ఆన్ మీదుగా వెళ్లి ప్రేక్షకుల స్టాండ్‌లో పడింది.
ఏకంగా ఆ బంతి ఓ మహిళా అభిమాని బీర్ గ్లాస్లో పడడంతో ఆ గ్లాస్లో ఉన్న బీరంతా చిల్లిపోయింది. మ్యాచ్‌ను ప్రసారం చేస్తున్న కెమెరాలకు ఈ ఘటన చిక్కింది. బంతి నుంచి తప్పించుకునేందుకు ప్రేక్షకుల ప్రయత్నిస్తున్న సమయంలో.. ఆ బంతి నేరుగా వెళ్లి బీర్ గ్లాస్లో పడడంతో నవ్వులు విరిశాయి. ఇక కామెంటేటర్లు కూడా తమ వ్యాఖ్యలతో ఆకట్టుకున్నారు. రెండవ టెస్టు తొలి రోజు న్యూజిలాండ్ 4 వికెట్లకు 318 రన్స్ చేసింది. మిచ్చెల్ 81 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.
Your tweet was quoted in an article by Insidesport https://t.co/SN0xhBQU8l
— Recite Social (@ReciteSocial) June 10, 2022
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఐపీఎల్ 2022లో మెరిసిన టాలెండెడ్ ఇండియన్ యువ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే వారిలోనూ మెరుగ్గా రాణించి.. ఏకంగా టీమిండియా సెలక్టర్ దృష్టిలో పడిన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ అని చెప్పడంలో సందేహమే లేదు.... Read more
Jun 11 | క్రికెట్లో కొన్నిసార్లు ఆటగాళ్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు ఆటగాళ్లు పాల్పడిన నేపథ్యంలో వారి జట్టు సారధి వారిని వారించి.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తాడు. అయితే కంచే చేసు మేసినట్లు..... Read more
Jun 11 | వరుస గాయాలు, పనితీరులో వైఫల్యంతో టీమిండియా జట్టుకు కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకోవడం తెలిసిందే. దీనిపై పాండ్యా తాజాగా స్పందించాడు. జట్టుకు దూరమైనప్పుడు... Read more
May 27 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ యేటి సీజన్లో శిఖర్ ధావన్ సూపర్ షో కనబరిచాడు. అయినా తాను ప్రతినిథ్యం వహించిన పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. శిఖర్ ధావన్... Read more
Apr 27 | ఆస్ట్రేలియా టీమ్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ మూడు వారాల పాటు మెంటల హాస్పిటల్లో గడపనున్నాడు. బుధవారం సిడ్నీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతన్ని అధికారులు పిచ్చాసుపత్రికి తరలించారు. డొమెస్టిక్ వయొలెన్స్ కింద... Read more