ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తుంటాం. అదే ఒక్క ఓవర్లో ఆరు వికెట్లు పడగొడితే.. కచ్చితంగా అద్భుతమనే చెప్పాలి. అలాంటి ఘటనే నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్ షిప్లో చోటుచేసుకుంది. అప్పటి వరకు పటిష్టంగా వున్న ప్రత్యర్థి జట్టు.. చివరి ఓవర్లో సాధ్యమైనంత అధిక పరుగులు సాధించి స్కోరుబోర్డుపై పెట్టాలన్న అలోచనలకు ఆ బౌలర్ తూట్లు పోడిచాడు. తన చేతిలోని మాయాజాలాన్నంతా మ్యాచ్ లోని తొలి ఇన్నింగ్స్ లోని చివరి ఓవర్ లోనే ప్రదర్శించాడు. అంతకుముందు ఓ ఓవర్ వేసినా.. సదరు బౌలర్ కు జట్టు కెప్టెన్ చివరి ఓవర్ కు ఎంచుకున్నందుకు తన నమ్మకాన్ని నిలిపాడు. ఇంతకీ ఆ మ్యాచులో ఏమైందంటే.?
నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ, మలేషియా ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచు జరుగుతోంది. మలేషియా XI బౌలర్ విరన్‌దీప్ సింగ్ ఈ టీ20 మ్యాచులో అప్పటికే ఓ ఓవర్ వేశాడు. అయితే ఏకంగా 9 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడి ఓవర్ ను టార్గెట్ చేసి సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ జట్టు భావించింది. అయితే మలేషియా ఎలెవన్ కెప్టెన్ మాత్రం స్పిన్నర్ విరన్ దీప్ సింగ్ పై పూర్తి నమ్మకం ఉంచాడు.
అంతే కెప్టెన్ నమ్మకాన్ని ఏమాత్రం ఒమ్ముకానివ్వని స్పిన్నర్ ఆఖరి ఓవర్లో ఆరు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. తొలి బంతిని వైడ్‌గా వేసిన విరన్ దీప్.. ఆ తర్వాత వరుసగా ఆరు వికెట్లు కూల్చాడు. ఇందులో హ్యాట్రిక్ సహా, ఓ రనౌట్ కూడా ఉండటం విశేషం. తొలి బంతికి క్రీజ్ లో కూరుకుపోయిన మృగ్యాంక్ పాఠక్ ను వెనక్కు పంపిన విరన్.. తరువాత బంతికి ఇషాన్ పాండేను రనౌట్ తో పెలివియన్ కు పంపాడు. ఇక ఆ తరువాత అనిండో నహారేయ్, విశేష్ సరోహా, జతిన్ సింఘాల్, స్పర్శ్ లను వరుసగా పెవిలియన్ కు పంపాడు.
ఇక ఈ క్రమంలో అనిండో నహారేయ్, విశేష్ సరోహా, జతిన్ సింఘాల్ వరుసగా పెవిలియన్ కు పంపడంతో విరన్ దీప్ సింగ్ తన తొలి హ్యాట్రిక్ ను కూడా సాధించాడు. 19వ ఓవర్ వరకు 131/3 స్కోరుతో పటిష్ఠ స్థితిలో కనిపించిన పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ జట్టు.. విరన్ దీప్ ధాటికి కేవలం ఒక్క పరుగును మాత్రమే స్కోరుబోర్డుకు జోడించిన ఢిల్లీ జట్టు.. 132/9 స్కోరుకు ఆటను ముగించింది. రనౌట్ అయిన ఇషాన్ పాండే తొలి పరుగును పూర్తి చేసి.. రెండో పరుగు కోసం వస్తూ రనౌట్ అయిన క్రమంలో తీసిన ఒక్క పరుగు స్కోరుబోర్డుకు జతకలిసింది.
అయితే ఇలాంటి ఘటన ఇంతకు ముందు కూడా జరగింది. దాదాపుగా 71 ఏళ్ల క్రితం, 1951 థామస్ హంటర్ కప్‌లో జరిగింది. రోలాండ్ యునైటెడ్.. రాయల్ వార్విక్షైర్ రెజిమెంటల్ అసోసియేషన్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో రోలాండ్ యూనైటెడ్ కు చెందిన సిహెచ్ సిర్రెట్ అనే బౌలర్ చెలరేగి ఆడాడు. సిర్రెట్ తన ఓవర్ లోని ఆరు బంతుల్లో ఆరు వికెట్లు సాధించాడు. దీంతో అప్పటి మ్యాచ్ కేవలం ఐదు ఓవర్లలోనే ముగిసిపోయింది. అయితే ఆరు వికెట్లు తీసినా.. ఎక్స్ ట్రాల రూపేనా మూడు పరుగులిచ్చాడు సిర్రెట్. విరన్‌దీప్ సృష్టించిన ఈ చరిత్రను మీరూ చూసేయండి.!
(And get your daily news straight to your inbox)
May 27 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ యేటి సీజన్లో శిఖర్ ధావన్ సూపర్ షో కనబరిచాడు. అయినా తాను ప్రతినిథ్యం వహించిన పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. శిఖర్ ధావన్... Read more
Apr 27 | ఆస్ట్రేలియా టీమ్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ మూడు వారాల పాటు మెంటల హాస్పిటల్లో గడపనున్నాడు. బుధవారం సిడ్నీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతన్ని అధికారులు పిచ్చాసుపత్రికి తరలించారు. డొమెస్టిక్ వయొలెన్స్ కింద... Read more
Apr 27 | రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు దొరికిన అత్యుత్తమ స్పిన్నర్. టెస్ట్ క్రికెట్లో దుమ్మురేపుతూ అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దీర్ఘకాల ఫార్మాట్లోనే కాకుండా పొట్టి... Read more
Apr 13 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే అనేక రకాల విచిత్రాలకు, సాహసాలకు వేదిక అన్న విషయం విధితమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో డిపెండింగ్ చాంఫియన్స్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్... Read more
Apr 13 | ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి కోట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టుకు తొలి గెలుపుతో ఉత్సాహం లభించింది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్... Read more