న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ త్వరలో రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలిపాడు. అందుకు సంబంధించిన ట్వీట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. న్యూజిలాండ్ జట్టులోని గొప్ప ఆటగాళ్లలో ఒకడైన టేలర్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో 100కు పైగా మ్యాచ్‌లాడిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. స్వదేశంలో ఈ వేసవి అనంతరం ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు రాస్ ప్రకటించారు.
‘ఈ వేసవి తర్వాత నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఆలోపు బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఆరు వన్డేలు ఆడాల్సి ఉంది. 17 ఏళ్లుగా నాకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు. న్యూజిలాండ్ తరఫున 234 ఆటగాడిగా ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది’ అని టేలర్ ట్వీట్ చేశాడు. కాగా, 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ కివీస్ బ్యాట్స్‌మన్ ఏళ్ల తరబడి ఆ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాడు. దీంతో ఇప్పటివరకు 110 టెస్టుల్లో 19 శతకాలతో 7,584 పరుగులు చేశాడు. అలాగే 233 వన్డేల్లో 21 సెంచరీలతో 8,581 పరుగులు చేశాడు. ఇక టీ20ల్లో 102 మ్యాచ్‌లు ఆడిన టేలర్.. 7 అర్ధశతకాలతో 1,909 పరుగులు చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more