Gary Kirsten Interested In Coaching England Test Side ఆ బాధ్యతలకు ఎప్పడూ సిద్దమే: మాజీ టీమిండియా కోచ్

Gary kirsten declares interest in becoming england s test coach

Veteran South Africa Cricketer, Gary Kirsten, England test coach, former Team India Coach, former south africa coach, Gary Kirsten India, Gary Kirsten news, Gary Kirsten England coach, Cricket news, Chris Silverwood, Ashes updates, Ashes news, India world cup coach, Indian cricket news, Australia cricket news, World Test championship, ICC World Cup, India 2011 World Cup, South Africa, Ashes, England, sports news, cricket news, Sports, Cricket

Gary Kirsten has declared his interest in becoming head coach of England's Test team, with Chris Silverwood likely to pay for their Ashes debacle with his job. Kirsten, the former South Africa and India coach, has applied for the role twice previously, in 2015 and 2019. He has not coached an international team since 2013

ఇంగ్లండ్ టెస్టు కోచ్ పై ఆసక్తిని కనబర్చిన మాజీ టీమిండియా కోచ్

Posted: 12/31/2021 08:51 PM IST
Gary kirsten declares interest in becoming england s test coach

యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఘోరమైన ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటికే వరుసగా మూడు టెస్ట్‌ల్లో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు కోచ్‌ సిల్వర్‌ వుడ్‌, కెప్టెన్‌ జో రూట్‌పైన తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ఓటమికు బాధ్యతగా వారి పదవులకు రాజీనామా చేయాలని ఇంగ్లండ్‌ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్ ఇంగ్లండ్ టెస్ట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. 2011 వన్డే ప్రపంచకప్‌ గెలచిన భారత జట్టు​కు కిర్‌స్టన్‌ కోచ్‌గా వ్యవహరించాడు. తర్వాత టీమిండియా కోచ్‌ బాధ్యతలు నుంచి తప్పుకున్నకిర్‌స్టన్‌.. 2011 నుంచి 2013 వరకు దక్షిణాఫ్రికా జట్టుకు కోచ్‌గా ఉన్నాడు.

కాగా కోచ్‌గా కిర్‌స్టన్ అద్భుతమైన రికార్డులను కలిగిఉన్నాడు. "ఇంగ్లండ్ టెస్ట్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు నేను ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాను. ఎందుకంటే ఇది గొప్ప గౌరవం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే నేను రెండు సార్లు ఈ బాధ్యతలను చేపట్టాను. అయితే ప్రస్తుతం అన్ని ఫార్మాట్‌ల్లో కోచ్‌గా పని చేయాలని నేను అనుకోవడం లేదు. అన్ని ఫార్మాట్‌లుకు ఒకే కోచ్‌ కాకుండా, వేర్వేరుగా ఉండేటట్లు అంతర్జాతీయ క్రికెట్ బోర్డులు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇంగ్లండ్‌ జట్టుకు వన్డే, టెస్ట్‌ ఫార్మాట్‌ల్లో కోచ్‌గా పని చేయాలి అని ఉంది. కానీ ఇప్పటికే వన్డేల్లో ఇంగ్లండ్‌ అధ్బుతంగా రాణిస్తుంది. వన్డేల్లో ఇంగ్లండ్‌ అత్యత్తుమైన జట్టు. ఇంగ్లండ్‌ వన్డే కోచింగ్‌ స్టాఫ్‌ అద్భుతమైనది. ఒకే వేళ కోచ్‌గా  బాధ్యతలు అవకాశం వస్తే గొప్ప గౌరవంగా భావిస్తాను" అని  కిర్‌స్టన్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : South Africa  coaching  England Test side  Gary Kirsten  Test Cricket  Sports  Cricket  

Other Articles