England fan proposes to Australian supporter during Ashes Test యాషెస్ టెస్టులో రోమాంటిక్ సీన్.. అసీస్ ప్రేయసికి ఇంగ్లాండ్ ప్రియుడి లవ్ ప్రపోజల్

England supporter proposes to australian fan during ashes test at the gabba

ashes 2021, australia vs england, aus v eng, gabba proposal, gabba marriage proposal, rival team fans marriage proposal, viral video, cricket news, sports news, sports, Cricket

While Australia and England were fighting it out on the field in the ongoing Ashes Test at the Gabba in Brisbane, an England supporter got down on one knee to propose to an Australia fan, leaving spectators delighted.

యాషెస్ టెస్టులో రోమాంటిక్ సీన్.. అసీస్ ప్రేయసికి ఇంగ్లాండ్ ప్రియుడి లవ్ ప్రపోజల్

Posted: 12/10/2021 04:26 PM IST
England supporter proposes to australian fan during ashes test at the gabba

 క్రీడా ప్రేమికులు తమ అభిమాన జట్టు ఆటను వీక్షిస్తూ స్టేడియంలోనే ప్రపోజ్ చేయడం వారికి క్రీడతో పాటు తమ ప్రేయసిపై కూడా వున్న ప్రేమను తెలియజేస్తోంది. అందుకనేమో.. ఈ మధ్య ఇలాంటి సన్నివేశాలు బాగానే క్రీడల్లో కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో జరిగింది. సర్వసాధారణంగా ఒకే దేశానికి చెందిన క్రీడాభిమానులు తమ ప్రేమను చాటుకోవడం ఇన్నాళ్లు చూశాం.. కానీ తాజాగా ప్రత్యర్థి జట్ల అభిమానులైన ఇద్దరు ప్రపోజ్ చేసుకోవడం, స్టాండ్స్‌లో ఉన్న ఫ్యాన్స్ వారిని ప్రోత్సహించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలను చుట్టేస్తోంది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య  ఇక్కడ తొలి టెస్టు జరుగుతోంది. మూడో రోజైన నేడు ఇంగ్లండ్‌కు చెందిన ఓ యువకుడు ఆస్ట్రేలియా గాళ్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. మొదట అతడి వంక ఆశ్చర్యంగా చూసిన అమ్మాయి.. అనుమతి ఇచ్చేందుకు ఎక్కువ సమయం ఏమీ తీసుకోలేదు. ఆ వెంటనే ముద్దులు, కౌగిలింతలతో స్టేడియం హోరెత్తిపోయింది. మ్యాచ్‌ను చిత్రీకరిస్తున్న కెమెరాలు ఒక్కసారిగా అటువైపు తిరిగాయి. స్టాండ్స్‌లోని అభిమానులు కూడా వారిని మరింత ఉత్సాహపరిచారు. కరతాళ ధ్వనులతో వారికి శుభాకాంక్షలు తెలిపారు.

యాషెస్ సందర్భంగా గబ్బాలో ఇలాంటి ప్రపోజల్ రావడం ఇదే రెండోసారి. 2017లోనూ ఓ జంట ఇలానే తమ ప్రేమను చాటుకుని మరో మెట్టు ఎక్కించారు. తాజా విషయానికి వస్తే మైఖేల్ అనే యువకుడు మోకాళ్లపై కూర్చుని టోరీ అనే యువతిని పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆమె క్షణకాలం పాటు నమ్మలేకపోయింది. ఆ వెంటనే తేరుకుని ఓకే చెప్పడంతో అతడి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వెంటనే తన చేతిలో ఉన్న ఉంగరాన్ని ఆమె చేతికి తొడిగాడు. వారి చుట్టూ ఉన్న అభిమానులు కూడా వారిని మరింత ఉత్సాహ పరచడంతో స్టాండ్స్ కేరింతలతో దద్దరిల్లింది.  

ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. హసీబ్ హమీద్ (25), ఒల్లీ పోప్ (35), జోస్ బట్లర్ (39), క్రిస్ వోక్స్ (21) మినహా మిగతా వారిలో ఎవరూ రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్ ఇంగ్లండ్ బౌలర్లను దంచికొట్టి 152 పరుగులు సాధించగా, ఓపెనర్ వార్నర్ 94 పరుగులు చేసి ఆరు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles