Rajasthan Royals retain captain Sanju Samson ఐపీఎల్ 2022: రాజస్థాన్ రాయల్స్ సారథ్య పగ్గాలు మళ్లీ సంజుకే.!

Rajasthan royals retain sanju samson for rs 14 crore ahead of ipl mega auction

Sanju Samson, Jos Buttler, Rajasthan Royals, Jofra Archer, yashasvi jaiswal, Liam Livingstone, Rajsthan Royals retained players, IPL 2022 retained players, IPL player retention, RR player retention, Rajasthan Royals player retentions Sanju Samson Rajasthan Royals, IPL 2022, IPL auction, IPL mega auction, IPL news, sports, cricket

Rajasthan Royals have decided to retain captain Sanju Samson ahead of the IPL mega auction, sources told NDTV on Friday. The wicketkeeper-batter had a brilliant IPL 2021, scoring 484 runs in 14 matches at an average 40.33. He scored the runs at a strike-rate of 136.72 with one century and two fifties to his name.

ఐపీఎల్ 2022: రాజస్థాన్ రాయల్స్ సారథ్య పగ్గాలు మళ్లీ సంజుకే.!

Posted: 11/26/2021 03:09 PM IST
Rajasthan royals retain sanju samson for rs 14 crore ahead of ipl mega auction

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజన్‌ కోసం మెగా వేలంకు సమయం దగ్గరపడడంతో ఆయా జట్లు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సిద్దం చేస్తున్నాయి. ఈ లిస్ట్‌ను జట్లు నవంబర్ 30 లోపు ఐపీఎల్ నిర్వాహకులకు అందజేయాలి. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో కూడా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ను కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే గత ఏడాది మాదిరిగా కాకుండా కొంత రెన్యూమరేషన్ పెంచుకునేలా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యాన్ని ఒప్పించడంలో సంజు సఫలీకృతం అయ్యాడు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం.. 14 కోట్లకు అతడు రాజస్తాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. స్టీవ్‌ స్మిత్‌ ఢిల్లీ జట్టులో చేరడంతో ఐపీఎల్‌ 2021 సీజన్‌లో కెప్టెన్సీ పగ్గాలను సంజూ శాంసన్‌కు రాజస్తాన్‌ అప్పజెప్పింది. కాగా 2018లో శాంసన్‌ను 8 కోట్లకు రాజస్తాన్‌ కొనుగోలు చేసింది. కాగా ఈ సారి మాత్రం ఆయన ప్యాకేజీని ఏకంగా రూ.14కోట్లకు పెంచేసింది. అంతే కాకుండా ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, భారత యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్, లియామ్ లివింగ్ స్టోన్ పేర్లు రిటైన్‌ చేసుకోనే లిస్ట్‌లో ఉన్నట్టు సమాచారం.

అదే విధంగా ఆ జట్టు స్టార్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను రిటైన్‌ చేసుకుంటారా లేదా అన్న అంశంపై ఎటువంటి సమాచారం లేదు. ఎందకంటే మానసిక ఆరోగ్య సమస్యల దృష్ట్యా క్రికెట్‌ నుంచి స్టోక్స్‌ నిరవధిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది14వ సీజన్‌లో శాంసాన్‌ అద్బుతంగా రాణించాడు. 14 మ్యాచ్‌ల‌లో సంజూ 484 ప‌రుగులు చేశాడు. కాగా సోషల్ మీడియాలో రాజస్థాన్ రాయల్స్‌ను ఆన్‌ ఫాలో చేసిన శాంసన్ జట్టును వీడి  చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో అతడు చేరనున్నట్లు వార్తలు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles