India-Pak Match Becomes Most-Watched T20I In History చరిత్రను తిరగరాసిన దాయాధుల ఐసీసీ టీ20 మ్యాచ్.!

Icc t20 world cup india pakistan 2021 world cup clash is the most viewed t20i match ever

India, Pakistan, India Vs Pakistan, IND Vs Pak, World cup, 2021 T20 World Cup, Sports, Cricket

With nearly 10,000 hours of live coverage across TV and digital platforms in 200 countries, the 2021 ICC Men's T20 World Cup delivered a record viewership globally, the cricket's global governing body said. The tournament returned after five years and saw an increased viewership and consumption in India, Pakistan, UK, Australia and the strategic market of USA.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్: దుమ్మరేపిన దాయాధుల మ్యాచ్ వ్యూవ్స్.!

Posted: 11/26/2021 11:07 AM IST
Icc t20 world cup india pakistan 2021 world cup clash is the most viewed t20i match ever

చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్లు ఏ స్థాయిలో, ఎక్కడ తలపడినా ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకిస్తుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ఎవరు గెలిచినా సరిహద్దుల్లోని జవాన్లు సంబరాలు జరుపుకుంటారు. అందుకే ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ లకు అంత ప్రత్యేకత. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబరు 24న దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ రికార్డులకెక్కింది. భారత్‌లో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్‌గా ఇది చరిత్ర సృష్టించింది.

మన దేశంలో స్టార్ ఇండియా నెట్ వర్క్ లో ఏకంగా 15.9 బిలియన్ నిమిషాలపాటు ఈ మ్యాచ్ ను వీక్షించినట్టు ఐసీసీ తాజాగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 10 వేల గంటలు లైవ్ కవరేజీ చేసినట్టు తెలిపింది. 2016 టీ20 ప్రపంచకప్‌లో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సెమీస్‌ను అత్యధికమంది వీక్షించగా ఇప్పుడా రికార్డు బద్దలైంది. ఇదే మ్యాచ్‌ను ఇంగ్లండ్‌లో స్కై యూకే నెట్‌వర్క్ ప్రసారం చేయగా 60 శాతం ఎక్కువ మంది ఈ మ్యాచ్‌ను వీక్షించారు. పాకిస్థాన్‌లో పీటీవీ, ఏఆర్‌వై, టెన్‌స్పోర్ట్స్‌లు ప్రసారం చేయగా 7.3 శాతం మంది అధికంగా వీక్షించారు.

ఆస్ట్రేలియాలో అయితే ఫాక్స్ నెట్‌వర్క్‌లో ఏకంగా 175 శాతం అధిక వీక్షణలు లభించినట్టు ఐసీసీ వివరించింది. అమెరికాలోనూ ఈ మ్యాచ్‌కు విశేష ఆదరణ లభించింది. ఈఎస్పీఎన్లో ప్రసారమైన భారత్-పాక్ మ్యాచ్‌ను గతంలో ఎన్నడూ లేనంతగా చూశారు. ఫేస్‌బుక్ లోనూ ఈ లీగ్ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ లభించాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లో 3.6 బిలియన్ వ్యూస్ లభించగా, ఈ మ్యాచ్‌ ఆ రికార్డును బద్దలు చేస్తూ 4.3  బిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఐసీసీ సామాజిక మాధ్యమాల ద్వారానూ అత్యధికమంది తిలకించారు. 618 మిలియన్ల మంది ఈ మ్యాచ్‌ను వీక్షించినట్టు ఐసీసీ వివరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Pakistan  India Vs Pakistan  IND Vs Pak  World cup  2021 T20 World Cup  Sports  Cricket  

Other Articles

Today on Telugu Wishesh