టీ20 ప్రపంచకప్-2021లో సమఉజ్జీ కాకపోయినా పాకిస్థాన్ తో ప్రారంబ మ్యాచ్లోనే ఓటమిని చవిచూసిన భారత్.. అత్యంత కీలకమైన రెండవ మ్యాచ్ న్యూజీల్యాండ్ తో జరిగినా.. చావు తప్పి కన్నులొట్టబోయిందన్న చందంగా ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత పసికూనలపై విరుచుకుపడి.. రన్ రేట్ పై ఆధారపడే స్థితికి జారినా.. ఆ అవకాశాన్ని ఏ జట్టు ఇవ్వకపోవడంతో చేసేది లేక చేతులెత్తేసి ఇంటిముఖం పట్టిన జట్టు.. తాజాగా మరోమారు న్యూజీల్యాండ్ తో తలపడేందుకు సిద్దంగా వుంది.
ఈ క్రమంలో జట్టు నాయకత్వ మార్పులతో పాటు ఇటు శిక్షకుడి స్థానంలోనూ మార్పులు జరిగడంతో భారత్ ఇక సాధనకు తెరతీసింది. స్వదేశంలో కివీస్‌తో జరుగుతున్న సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది. టి20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్‌పై దృష్టి పెట్టింది. స్వదేశంలో జరుగునున్న ఈ సిరీస్ లో పర్యాటక జట్టుపై బదులు తీర్చుకోవాలన్న కసితో రోహిత్ సేన కదం తొక్కుతోంది. నవంబర్ 17 నుంచి టి20 సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో టీమిండియా నవంబర్ 14న యూఏఈ నుంచి స్వదేశానికి చేరుకొని జైపూర్‌లో అడుగుపెట్టారు.
మూడు రోజుల క్వారంటైన్ అనంతరం టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను ఆరంభించింది. ఇక రోహిత్ శర్మకు టి20ల్లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఇదే మొదటి టి20 సిరీస్ కానుంది. ఈ నేపథ్యంలోనే ద్రవిడ్ హిట్‌మ్యాన్‌కు బంతులు విసరడం.. అతను కొన్ని చక్కని షాట్లు ఆడడం వైరల్‌గా మారింది. కాగా రోహిత్ శర్మ ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌ల్లో 174 పరుగులు చేసిన రోహిత్ రెండు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. కేఎల్ రాహుల్ తర్వాత టీమిండియా తరపున రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Jul 02 | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత సారధి జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్ లో రికార్డు అనగానే ఆయన తీసిన వికెట్ల సంఖ్య లెక్కకట్టడం ఆపండీ.. అసలు మ్యాటర్... Read more
Jun 11 | ఐపీఎల్ 2022లో మెరిసిన టాలెండెడ్ ఇండియన్ యువ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే వారిలోనూ మెరుగ్గా రాణించి.. ఏకంగా టీమిండియా సెలక్టర్ దృష్టిలో పడిన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ అని చెప్పడంలో సందేహమే లేదు.... Read more
Jun 11 | క్రికెట్లో కొన్నిసార్లు ఆటగాళ్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు ఆటగాళ్లు పాల్పడిన నేపథ్యంలో వారి జట్టు సారధి వారిని వారించి.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తాడు. అయితే కంచే చేసు మేసినట్లు..... Read more
Jun 11 | వరుస గాయాలు, పనితీరులో వైఫల్యంతో టీమిండియా జట్టుకు కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకోవడం తెలిసిందే. దీనిపై పాండ్యా తాజాగా స్పందించాడు. జట్టుకు దూరమైనప్పుడు... Read more
Jun 11 | న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచ్చెల్ తాను మైదానంలో ప్రత్యర్థి జట్టుతో క్రికెట్ అడుతుండగా.. అదే మైదానం నుంచి క్రికెట్ వీక్షిస్తున్న అభిమాని బీర్ తాగుతుండటంతో ఆయన చీర్స్ చెప్పాడు. అదేంటి మైదనంలో క్రికెట్ అడుతున్న... Read more