Catch deemed illegal for ‘intended assist’ from outside బౌండరీ లైన్ లోపలే క్యాచ్ పట్టినా.. అంపైర్ సిక్స్ ఇచ్చాడు..!

Watch catch deemed illegal for intended assist from outside boundary

Daniel Bell-Drummond, Jordan Cox, Kent vs Somerset, somerset, Will Smeed, cricket laws, cricket rare laws, out or not out, Vitality T20 Blast, Jordan Cox, Joe Denly, cricket news, latest cricket news, sports news, sports, Cricket

Vitality T20 Blast: Jordan Cox thought he had taken a clean catch, before one of cricket’s rarer laws were invoked, deeming the catch illegal because of his teammate who had tried to help. In the final of the T20 Blast between Somerset and Kent, when a catch taken at the boundary rope by Kent’s Jordan Cox was deemed illegal because he had been in contact with one of his teammates who had crossed the line.

బౌండరీ లైన్ లోపలే క్యాచ్ పట్టినా.. అంపైర్ సిక్స్ ఇచ్చాడు..!

Posted: 09/22/2021 08:37 PM IST
Watch catch deemed illegal for intended assist from outside boundary

క్రికెట్ ఆటలో రూల్స్ ఎంతో అవసరం. రూల్స్ ప్రకారం ఆడినా.. పలు సందర్భాలలో అవి వింతలుగానే కనిపిస్తుంటాయి. క్రికెట్ ను ఏళ్లుగా ఫాలో అవుతున్నవారు కూడా వింత‌ను అర్థం చేసుకోలేరు. ఎందుకంటే క్రికెట్ రూల్స్ తెలియదు కాబట్టే. అలాంటి ఘటనే కెంట్‌, సోమ‌ర్సెట్ మ‌ధ్య వైటాలిటీ బ్లాస్ట్ టీ20 ఫైన‌ల్లో జ‌రిగింది. సోమ‌ర్సెట్ బ్యాట్స్‌మ‌న్ విల్ స్మీడ్ ఓ భారీ షాట్ కొట్టాడు. సిక్స్ అనుకుంటున్న తరుణంలో దానిని బౌండ‌రీ ద‌గ్గ‌ర జోర్డాన్ కాక్స్ క్యాచ్ అందుకున్నాడు. కానీ కొన్ని నిమిషాల పాటు అలోచించిన అంపైర్లు దానిని సిక్స్ గా ప్రకటించారు. దీంతో ఔటయ్యానని నిరాశగా వెనుదిరిగిన బ్యాట్స్ మ‌న్.. సిక్స్ అని ప్రకటించగానే మళ్లీ వచ్చి బ్యాటింగ్ చేశాడు. ఎలాంటి తప్పులకు అస్కారం లేకుండా పట్టిన క్యాచ్ ను అంపైర్లు ఎందుకని ఔట్ గా ప్రకటించారు.  

కాక్స్ క్యాచ్ అందుకుంటున్న స‌మ‌యంలోనే అటు వైపు నుంచి మ‌రో ఫీల్డ‌ర్ డేనియ‌ల్ బెల్ కూడా అందుకోవ‌డానికి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో అత‌డు డైవ్ చేశాడు. అప్ప‌టికే కాక్స్ క్యాచ్ అందుకున్నా.. డైవ్ చేసే క్ర‌మంలో డేనియ‌ల్ బెల్ నియంత్ర‌ణ కోల్పోయి బౌండ‌రీ లైన్‌కు తాకాడు. అదే స‌మ‌యంలో ఇటు కాక్స్ కూడా బెల్ నుంచి త‌ప్పించుకోబోయి అత‌న్ని తాకాడు. అన్ని కోణాల్లో రీప్లేలు చూసిన థ‌ర్డ్ అంపైర్ చివ‌రికి దీనిని సిక్స్‌గా ప్ర‌క‌టించాడు. క్యాచ్ ప‌ట్టుకున్న ఫీల్డ‌ర్ నేరుగా బౌండ‌రీ లైన్‌ను తాక‌కున్నా.. ఆ లైన్‌ను తాకిన మ‌రో ఫీల్డ‌ర్‌ను ట‌చ్ చేయ‌డం కొంప ముంచింది.

అంపైర్ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. అస‌లు ఇది సిక్స్ ఎలా అవుతుంది? ఎందుకు అవుటివ్వ‌లేదు అని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు క్రికెట్ రూల్ ఏం చెబుతోందో చూద్దాం. ఎంసీసీలోని చ‌ట్టం 19.5.1 ప్ర‌కారం.. ఓ ఫీల్డ‌ర్ గ్రౌండ్ లోప‌లే ఉన్నా.. అత‌ని శ‌రీరంలోని ఓ భాగం బౌండ‌రీ లైన్ బ‌య‌ట ఉన్న ఫీల్డ‌ర్‌కు త‌గిలిన‌ప్పుడు, ఇద్ద‌రు ఫీల్డ‌ర్స్‌లో ఎవ‌రో ఒక‌రు కావాల‌ని ఫీల్డింగ్‌లో సాయం చేసే ఉద్దేశంతో ఉన్నాడ‌ని అంపైర్ భావిస్తే దానిని నాటౌట్ ప్ర‌క‌టించ‌వ‌చ్చు. అంటే ఈ విష‌యంలో అంపైర్ విచ‌క్ష‌ణే ముఖ్యం. తాజా మ్యాచ్‌లోనూ మూడో అంపైర్ అన్ని కోణాల్లో రీప్లేలు చూసిన త‌ర్వాత చివ‌రికి బ్యాట్స్‌మ‌న్‌కు అనుకూలంగా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Daniel Bell-Drummond  Jordan Cox  Kent vs Somerset  somerset  Will Smeed  Cricket  sports  

Other Articles