టీమిండియా వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ సారధి, యువకెరటం రిషభ్ పంత్ పుట్టిన రోజు సందర్భంగా నెట్టింట్లో అతనిపై శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. సోమవారం నాడు రిషభ్ పంత్ 24వ ఏట అడుగుపెడుతున్నాడు. 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన పంత్ ఆ తర్వాత అన్ని ఫార్మాట్లలో ఆడాడు. ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సారధి శ్రేయాస్ అయ్యర్‌కు గాయం అవడంతో జట్టు సారధ్య బాధ్యతలు కూడా భుజాన వేసుకున్నాడు. అతని సారధ్యంలో జట్టు అద్భుతంగా రాణిస్తోంది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో సమానంగా పాయింట్లు సాధించింది. సోమవారం పంత్ పుట్టినరోజు నాడు అతని సారధ్యంలోని ఢిల్లీ జట్టు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పంత్‌పై బర్త్‌డే విషెస్ కోకొల్లలుగా వస్తున్నాయి. ఐసీసీ, బీసీసీఐ, ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం, అభిమానులు, కుటుంబ సభ్యులు అందరూ పంత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చెన్నైపై విజయంతో ఈ పుట్టినరోజును మర్చిపోలేని అనుభూతిగా మార్చుకోవాలని ఆశిస్తూ ఢిల్లీ జట్టు ట్వీట్ చేసింది.
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఐపీఎల్ 2022లో మెరిసిన టాలెండెడ్ ఇండియన్ యువ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే వారిలోనూ మెరుగ్గా రాణించి.. ఏకంగా టీమిండియా సెలక్టర్ దృష్టిలో పడిన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ అని చెప్పడంలో సందేహమే లేదు.... Read more
Jun 11 | క్రికెట్లో కొన్నిసార్లు ఆటగాళ్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు ఆటగాళ్లు పాల్పడిన నేపథ్యంలో వారి జట్టు సారధి వారిని వారించి.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తాడు. అయితే కంచే చేసు మేసినట్లు..... Read more
Jun 11 | వరుస గాయాలు, పనితీరులో వైఫల్యంతో టీమిండియా జట్టుకు కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకోవడం తెలిసిందే. దీనిపై పాండ్యా తాజాగా స్పందించాడు. జట్టుకు దూరమైనప్పుడు... Read more
Jun 11 | న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచ్చెల్ తాను మైదానంలో ప్రత్యర్థి జట్టుతో క్రికెట్ అడుతుండగా.. అదే మైదానం నుంచి క్రికెట్ వీక్షిస్తున్న అభిమాని బీర్ తాగుతుండటంతో ఆయన చీర్స్ చెప్పాడు. అదేంటి మైదనంలో క్రికెట్ అడుతున్న... Read more
May 27 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ యేటి సీజన్లో శిఖర్ ధావన్ సూపర్ షో కనబరిచాడు. అయినా తాను ప్రతినిథ్యం వహించిన పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. శిఖర్ ధావన్... Read more