ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బీసిసిఐ ఇప్పటి వరకు కేవలం టీమిండియా ప్లేయర్లకే పెద్దపీట వేస్తుందన్న వార్తలున్నాయి. దీంతో వాటిని బాపుకుంటూ దేశవాళీ క్రికెటర్లకు కూడా బిసిసిఐ గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్ల మ్యాచ్ ఫీజులను పెంచుతున్నట్లు బోర్డు కార్యదర్శి జే షా సోమవారం ట్విటర్ ద్వారా ప్రకటించారు. సీనియర్ ప్లేయర్స్కు, అండర్ 23, అండర్ 19 క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను బోర్డు పెంచింది. 40 మ్యాచ్లకుపైగా ఆడిన అనుభవం ఉన్న సీనియర్ దేశవాళీ క్రికెటర్లకు ఇక నుంచి ఒక రోజు మ్యాచ్ ఫీజును రూ.60 వేలకు పెంచినట్లు జే షా చెప్పారు. ఇన్నాళ్లూ వీళ్లు రంజీ ట్రోఫీ లేదా విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటే మ్యాచ్ రోజు రూ.35 వేలు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు దానిని రూ.60 వేలకు పెంచారు.
ఇక అండర్ 23 క్రికెటర్లకు రూ.25 వేలు, అండర్ 19 క్రికెటర్లకు రూ.20 వేలు మ్యాచ్ ఫీజుగా ఇవ్వనున్నట్లు జే షా వెల్లడించారు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే క్రికెటర్లకు రూ.17500 ఇస్తున్నారు. తుది జట్టులో ఆడే ప్లేయర్స్కు ఈ మ్యాచ్ ఫీజు ఇస్తుండగా.. రిజర్వ్ ప్లేయర్స్ ఇందులో సగం మొత్తం అందుకుంటారు. ఇక గతేడాది కరోనా కారణంగా దేశవాళీ సీజన్ నష్టపోవడంతో క్రికెటర్లకు పరిహారం ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. 2019-20 సీజన్ ఆడిన క్రికెటర్లకు 2020-21 సీజన్లో 50 శాతం అదనంగా చెల్లించనున్నట్లు కూడా జే షా ప్రకటించారు.
I am pleased to announce the hike in match fee for domestic cricketers.
— Jay Shah (@JayShah) September 20, 2021
Seniors – INR 60,000 (above 40 matches).
Under 23- INR 25,000
Under 19 – INR 20,000#BCCIApexCouncil
(And get your daily news straight to your inbox)
Jul 02 | ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత సారధి జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్ లో రికార్డు అనగానే ఆయన తీసిన వికెట్ల సంఖ్య లెక్కకట్టడం ఆపండీ.. అసలు మ్యాటర్... Read more
Jun 11 | ఐపీఎల్ 2022లో మెరిసిన టాలెండెడ్ ఇండియన్ యువ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే వారిలోనూ మెరుగ్గా రాణించి.. ఏకంగా టీమిండియా సెలక్టర్ దృష్టిలో పడిన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ అని చెప్పడంలో సందేహమే లేదు.... Read more
Jun 11 | క్రికెట్లో కొన్నిసార్లు ఆటగాళ్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు ఆటగాళ్లు పాల్పడిన నేపథ్యంలో వారి జట్టు సారధి వారిని వారించి.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తాడు. అయితే కంచే చేసు మేసినట్లు..... Read more
Jun 11 | వరుస గాయాలు, పనితీరులో వైఫల్యంతో టీమిండియా జట్టుకు కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకోవడం తెలిసిందే. దీనిపై పాండ్యా తాజాగా స్పందించాడు. జట్టుకు దూరమైనప్పుడు... Read more
Jun 11 | న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచ్చెల్ తాను మైదానంలో ప్రత్యర్థి జట్టుతో క్రికెట్ అడుతుండగా.. అదే మైదానం నుంచి క్రికెట్ వీక్షిస్తున్న అభిమాని బీర్ తాగుతుండటంతో ఆయన చీర్స్ చెప్పాడు. అదేంటి మైదనంలో క్రికెట్ అడుతున్న... Read more