MS Dhoni's new look breaks the internet, leaves fans in awe ఐపీఎల్ యాడ్ లో.. సరికోత్త లుక్ తో ధోని హల్ చల్

Vivo ipl 2021 ms dhoni s new look leaves fans wondering sends social media into a tizzy

MS Dhoni, Mahendra Singh Dhoni, Dhoni hairstyle, IPL 2021, vivo ipl 2021, mahendra singh dhoni, ms dhoni new look, chennai super kings, csk vs mi, uae, sports news, cricket news, sports, cricket

Former Team India skipper Mahendra Singh Dhoni always turns heads with his looks. Whether he sports long hair or goes bald, Dhoni always has something exciting for his fans by actually pulling off any look with elan.

ఐపీఎల్ యాడ్ లో.. సరికోత్త లుక్ తో ధోని హల్ చల్

Posted: 08/20/2021 08:12 PM IST
Vivo ipl 2021 ms dhoni s new look leaves fans wondering sends social media into a tizzy

కరోనా వ్యాప్తి కారణంగా భారత్ లో నిలిచిపోయిన ఐపీఎల్ 14 సీజన్ త్వరలోనే పునఃప్రారంభం కాబోతోంది. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టోర్నీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ చానల్ ఆసక్తికర ప్రచార వీడియోను పంచుకుంది. తన క్రికెట్ కెరీర్ కు త్వరలో వీడ్కోలు పలకబోతున్న టీమిండియా మాజీ కెప్టెన్.. భారత్ కు వరల్డ్ కప్ తో పాటు టీ20 వరల్డ్ కప్ సహా ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనితో ఓ చక్కటి యాడ్ షూట్ చేసింది.

ఇందులో మిస్టర్ కూల్ మహేంద్రుడు వెరైటీ గెటప్పుతో దర్శనమివ్వడంతో నెట్ జనులతో పాటు క్రికెట్ అభిమానులు, ధోని ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబవుతున్నారు.  జుట్టుకు రంగు, ఫ్యాషనబుల్ డ్రెస్సుతో హుషారుగా గెంతుతూ వినోదం పండించాడు. ఐపీఎల్ 2021 మిగిలిన భాగాన్ని ప్రదర్శిస్తున్న క్రమంలో పిక్చర్ అభి భాకీ హై అన్న ట్యాగ్ తో చేసిన ఈ యాడ్ షూట్ ఆద్యంతం అకట్టుకుంటోంది. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ వస్తోందని, తుపానులా ఉంటుందని ధోనీ పేర్కొనడం ఈ వీడియోలో చూడొచ్చు. ఫస్టాఫ్ ను మించిన థ్రిల్ ఖాయమని, క్లైమాక్స్ అదిరిపోతుందని ఓ సినిమా లెవల్లో పబ్లిసిటీ ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Mahendra Singh Dhoni  Dhoni hairstyle  IPL 2021  sports  cricket  

Other Articles

Today on Telugu Wishesh